మారుతున్న సాంకేతికతను అనుసరిస్తూ.. సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. 'ఫిషింగ్ టెక్నిక్' ద్వారా ఆశ చూపించి డబ్బులు కొట్టేసే కొత్త మోసాలకు తెరతీశారు. ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండానే మన నగదును, సమాచారాన్ని తస్కరిస్తున్నారని 'కాస్పర్‌స్కై' తన నివేదికలో తెలిపింది. ఇటీవలి కాలంలో వాట్సాప్ లక్ష్యంగా సైబర్ ఎటాక్‌లు చేస్తున్నారని పరిశోధకులు కూడా తేల్చారు.
ఫిషింగ్ ఎటాక్ అంటే..?
సైబర్ నేరగాళ్లు.. ఏదో ఒకటి ఆశచూపి ప్రజలను వలలో వేసుకుంటారు. దీనినే ఫిషింగ్ ఎటాక్ అంటారు. ప్రముఖ వెబ్సైట్స్లానే నకిలీ సైట్లు సృష్టించి.. అందులోంచి మెసేజ్‌లు పంపుతారు. మన దగ్గర ఉన్న ఆర్థిక, వ్యక్తిగత సమాచారమే లక్ష్యంగా ఈ మెయిల్స్ పంపుతారు. అంతేకాక.. తమ ట్రిక్కుల ద్వారా నకిలీ వెబ్సైట్లలోకి వెళ్లేలా చేస్తారు.
ఎలాంటి మెసేజ్‌లతో వల వేస్తారు..?
ప్రైజ్‌లు ఇస్తామని, మీరు లక్కీ డ్రాలో భారీ మెత్తంలో డబ్బును గెలుచుకున్నారని.. అయితే మీకు మొత్తం డబ్బు దక్కాలంటే.. ముందు కొంత మనీ కట్టాలని నమ్మిస్తారు. ఇంకా నకిలీ ఉత్పత్తులపై ఆఫర్లు చూపిస్తూ.. మీరు వాటిని ఆర్డర్ చేసేలా చేస్తారు. అయితే ఆ ఉత్పత్తులు మీరు ఇచ్చిన అడ్రస్‌కు మాత్రం రావు.
'కాస్పర్‌స్కై' పరిశోధనలో తేలిన మరో అంశం ఏంటంటే.. ఫేక్ ఫేస్బుక్ పేజీని సృష్టించి.. అందమైన అపరిచితులతో చాటింగ్‌కు ఆహ్వానిస్తారు.
సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?