తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్ డీపీకి ఇకపై మరింత ప్రైవసీ!

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల(whatsapp profile hide news)ను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్​.. మరోసారి సరికొత్త అప్​డేట్​తో ముందుకు రానుంది. ప్రొఫైల్ ఫొటో ప్రైవసీకి సంబధించిన ఫీచర్ ఇది.

WhatsApp
వాట్సాప్

By

Published : Oct 9, 2021, 8:44 AM IST

కొత్త ఫీచర్లతో ఎప్పుటికప్పుడు అప్‌డేట్‌గా ఉండే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌(whatsapp profile hide news).. వినియోగాదారుల ప్రైవసీకి సంబంధించి మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు 'ప్రొఫైల్‌ ఫొటో(whatsapp profile hide news) ప్రైవసీ సెట్టింగ్‌'లో వాట్సాప్‌ మార్పులు తీసుకొస్తున్నట్లు సమాచారం. కొత్తగా రాబోయే ఈ మార్పుతో ఇకపై మీ ప్రొఫైల్‌ పిక్చర్‌ను ఎవరెవరు చూడాలో మీరే నియంత్రించుకోవచ్చు. నిర్దిష్ట వ్యక్తులు చూడకుండా గోప్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకు కస్టమ్‌ ప్రైవసీ సెట్టింగ్‌లో ఇప్పటికే ఉన్న 'Everyone', 'My contacts', 'Nobody'కి తోడుగా కొత్తగా 'My contacts exept'ను వాట్సాప్‌ జోడించనుంది.

వాట్సాప్ డీపీ సెట్టింగ్స్

ఫలితంగా మీరు డీపీగా పెట్టుకున్న ఫొటోను మీరు వద్దనుకుంటున్న ఫలాన వ్యక్తి చూడకుండా జాగ్రత్త పడొచ్చు. వాట్సాప్‌ లాస్ట్‌ సీన్‌ (Last seen), అబౌట్‌ స్టేటస్‌ (About) సెట్టింగ్‌లోనూ ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం వాట్సాప్‌ ఈ కొత్త 'ప్రొఫైల్‌ ఫోటొ ప్రైవసీ సెట్టింగ్‌' పై పనిచేస్తుందట. అలాగే ఐఓఎస్‌ వినియోగదారుల కోసం కూడా పరీక్షలు ప్రారంభించింది. దీనిబట్టి చూస్తే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఒక్కసారే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: వాయిస్​ మెసేజ్​ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్​

ABOUT THE AUTHOR

...view details