తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫోన్‌ నంబర్‌ సేవ్ చేయకుండానే.. వాట్సాప్ చాట్, వాయిస్‌ కాలింగ్

WhatsApp pop up chat: వాట్సాప్‌లో చాట్ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో చేసుకోవాల్సిందే. అలానే కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో నంబర్‌ సేవ్‌ చేసుకునేందుకు ఫోన్‌ నంబర్ కాపీ చేసి డయల్ పాడ్‌లో పేస్ట్ చేసి సేవ్‌ చేయడం మినహా ఇతర ఆప్షన్‌ ఉండేదికాదు. త్వరలో తీసుకురానున్న పాప్‌-అప్‌ మెనూ అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ సులభతరం కానుంది. ఫోన్​ నంబర్​ సేవ్​ చేయకుండానే.. వాట్సాప్​ చాట్​, వాయిస్​ కాలింగ్​ చేయొచ్చు.

WhatsApp
వాట్సాప్ చాట్

By

Published : Apr 2, 2022, 3:00 PM IST

WhatsApp pop up chat: వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌లో ఆరు కొత్త ఫీచర్లతో పాటు, మల్టీడివైజ్‌ సపోర్ట్‌, ఇమేజ్‌ ఎడిట్‌ వంటి ఫీచర్లను ఈ ఏడాదిలో తీసుకొచ్చింది. త్వరలో చాట్ పేజీలో తీసుకురానున్న కొత్త ఫీచర్‌తో యూజర్స్‌ వాట్సాప్‌లో ఏదైనా ఫోన్ నంబర్‌ షేర్‌ చేసిన తర్వాత, రిసీవర్‌ సదరు ఫోన్‌ నంబర్‌పై క్లిక్ చేస్తే పాప్‌-అప్‌ మెనూ ప్రత్యక్షమవుతుంది. అందులో చాట్‌, డయల్‌, యాడ్‌ కాంటాక్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. దీంతో యూజర్‌ సదరు ఫోన్‌ నంబర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేయకుండానే చాట్ చేయొచ్చు. అలానే డయల్‌ ఆప్షన్‌ ద్వారా సదరు వ్యక్తికి కాల్ చేసి మాట్లాడొచ్చు. యాడ్‌ టు కాంటాక్ట్స్‌పై క్లిక్ చేస్తే ఫోన్‌ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో నంబర్‌ సేవ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. గతంలో వాట్సాప్‌లో చాట్ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ చేసుకోవాల్సిందే. అలానే కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో నంబర్‌ సేవ్‌ చేసుకునేందుకు ఫోన్‌ నంబర్ కాపీ చేసి డయల్ పాడ్‌లో పేస్ట్ చేసి సేవ్‌ చేయడం మినహా ఇతర ఆప్షన్‌ ఉండేదికాదు. త్వరలో తీసుకురానున్న పాప్‌-అప్‌ మెనూ అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ సులభతరం కానుంది. అలానే వాట్సాప్‌ వ్యూవన్స్‌ ఫీచర్‌ను త్వరలోనే విండోస్‌ యూజర్లకు కూడా పరిచయం చేయనుంది. గతేడాది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు వ్యూవన్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇవేకాకుండా వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు 37 కొత్త ఎమోజీలను పరిచయం చేయనుంది. ఇందులో మెల్టింగ్‌ ఫేస్‌, ఆఫ్‌ ఫేస్‌ సెల్యూట్, డాటెడ్‌ లైన్‌ ఫేస్‌ ఇలా దాదాపు 37 ఎమోజీలు ఉన్నాయి. ఈ ఎమోజీలకు సంబంధించి యాపిల్‌ ఐఓఎస్‌ 15.4 వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి:వాట్సాప్‌ కొత్త ఫీచర్​.. ఇకపై 2 జీబీ ఫైల్‌ షేరింగ్​!

ABOUT THE AUTHOR

...view details