WhatsApp news: కోట్ల మంది యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది దిగ్గజ మెసెంజర్ వాట్సాప్. ఇప్పుడు మరో రెండు అధునాతన ఫీచర్లను వినియోగదారుల కోసం పరీక్షిస్తోంది. ప్రస్తుతం మనం ఏదైనా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినప్పుడు అందులోని సభ్యులందరికీ ఆ విషయం తెలుస్తుంది. మనం గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చిన్న టెక్ట్స్ లైన్ కన్పిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీనితో మనం గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే అడ్మిన్‌కు తప్ప గ్రూప్‌లో ఇతర సభ్యులెవరికీ ఆ విషయం తెలియదు. ఎలాంటి సందేశం కూడా కన్పించదు.
వాట్సాప్‌లో చాలా గ్రూప్‌లలో ఉండి లెఫ్ట్ అవ్వాలనుకున్నా ఇతర సభ్యులు ఏం అనుకుంటారో అనే భావనతో కొంత మంది వెళ్లిపోరు. కొత్త ఫీచర్‌తో ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. మనకు ఇష్టం లేని గ్రూప్‌ల నుంచి సైలెంట్‌గా వెళ్లిపోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌లో పరీక్షిస్తున్నారు. మరో రెండు నెలల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.