వాట్సాప్ సోమవారం కొత్తగా 'యాక్సిడెంటల్ డిలీట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వాట్సాప్ యూజర్లకు కొత్త రక్షణ పొరగా నిలవనుంది. సాధారణంగా ఒక వ్యక్తికి పంపాల్సిన మెసేజ్‌ను పొరపాటున మరొక స్నేహితుడికి పంపిస్తుంటాము. తర్వాత తేరుకొని వెంటనే డిలీట్ చేద్దామని 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్'కు బదులు 'డిలీట్ ఫర్ మీ'పై క్లిక్ చేస్తాము. అప్పుడు ఆ సందేశం మన చాట్ నుంచి మాత్రమే డిలీట్ అయ్యి అవతలి వారి చాట్‌లో అలానే ఉంటుంది. దీంతో కొన్నిసార్లు సన్నిహితుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా వాట్సాప్ తెచ్చిన ఈ నయా ఫ్యూచర్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ETV Bharat / science-and-technology
వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్ డిలీట్ చేశారా? అయినా నో ప్రాబ్లం!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్‌ను వినిపించింది ఆ సంస్థ. సోమవారం యాప్‌లో కొత్తగా 'యాక్సిడెంటల్ డిలీట్' ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇది యాప్ యూజర్లకు కొత్త రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని మెటా సంస్థ తెలిపింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి తెచ్చిన యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌తో.. మనం పంపించి 'డిలీట్ ఫర్ మీ' చేసిన మెసేజ్‌ను తిరిగి పొందడానికి ఐదు సెకన్ల సమయం లభిస్తుంది. ఈ విండో ఓపెన్ అవ్వగానే 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ మెసేజ్ ఇద్దరి చాట్ నుంచి తొలగిపోతుంది.
ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి..
యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. గత నెలలో వాట్సాప్ కొత్తగా 'మెసేజ్ యువర్ సెల్ఫ్' ఫీచర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది మనకు మనం నోటిఫికేషన్స్, రిమైండర్స్, అప్డేట్స్ పంపించుకోవడానికి వీలుగా తెచ్చిన వన్ టు వన్ చాట్ ఫీచర్.