వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడంలో ముందుటుంది. దీని కోసం కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇకపై వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. చాట్ విత్ యువర్ సెల్ఫ్, గ్రూప్ చాట్స్‌లో ప్రొఫైల్ ఫొటోస్, ఇమేజ్‌లకు బ్లర్ ఆప్షన్, మీడియాకు క్యాప్షన్స్, డెస్క్‌టాప్‌లో.. మీడియా ఆటో డౌన్లోడ్ వంటి పలు రకాల కొత్త ఫీచర్స్‌ను వినియోగదారులకు అందించనుంది. అయితే ఇవి ప్రస్తుతానికి బీటా టెస్టర్లకే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయాత్నాలు చేస్తుంది. అవి ఏంటంటే?
చాట్ విత్ యువర్ సెల్ఫ్.. ఈ ఫీచర్లో భాగంగా మన నంబర్‌కు మనమే మెసేజ్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఏ విండో ఉండదు. వాట్సాప్‌లో మన సొంత నెంబర్‌ను ఎంచుకున్నప్పుడు.. ఇకపై పర్సనల్ చాట్ అనే ప్రత్యేక బాక్స్ కనిపిస్తుంది. వాట్సాప్ కాంటక్ట్ లిస్ట్‌లో ఇకపై మన నెంబర్ కూడా కనిపించనుంది. దీని ద్వారా సొంత నెంబర్‌కే.. నచ్చిన ఫైల్స్, వీడియోలు పంపించుకోవచ్చు. గతంలో.. ఒకే ఒక నెంబర్‌తో వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో మీడియా ఫైల్స్‌ను పంపించుకునే అవకాశం ఉంది.. ఇకపై అలా లేకుండా సొంత నెంబర్‌కే మెసేజ్ పంపించుకోవచ్చు.
మీడియాకు క్యాప్షన్స్.. వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలు, GIFలను ఇతరులకు ఫార్వర్డ్ చేసేటప్పుడు.. ఇకపై మీడియాతో పాటు సందేశాన్ని కూడా రాసి పంపే ఆప్షన్ అందుబాటులోకి రానుంది.