'అన్డూ ట్వీట్' అనే సరికొత్త ఫీచర్ తీసుకురావడానికి మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ యత్నిస్తోంది. దీని ద్వారా టైపింగ్ లేదా ఇతర తప్పులున్న ట్వీట్లను.. నిర్దిష్ట సమయంలోగా తొలగించే వీలుంటుంది. అయితే ఈ ఆప్షన్‌ను డబ్బులు చెల్లించిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు.
అక్షర దోషాలు లేదా ఇతర తప్పులను సరిచేసేందుకు ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ లేదు. ఎప్పటినుంచో వినియోగదారులు దానికోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న డిలీట్ ఆప్షన్‌కు భిన్నంగా ఈ అన్డూ ఆప్షన్‌ను ట్విట్టర్ తీసుకురానుందని టెక్ నిపుణులు జేన్ మన్చున్ తెలిపారు.