ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ లేకుండా ఇంటి బయట కాలు పెట్టడం ప్రమాదకరం. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మాస్కే శ్రీరామ రక్ష. అయితే మాస్క్ వల్ల మట్లాడినా, నవ్వినా పెదవుల కదలిక ఇతరలకు కనిపించదు. ఈ సమస్యను అధిగమించడానికి.. ముఖంలోని భావోద్వేగాలు తెలిసేలా ఓ స్మార్ట్ మాస్క్‌ను తయారు చేశారు టెక్ నిపుణుడు టైలర్ గ్లయేల్.
ఇలా పని చేస్తుంది!
మాస్క్ ధరించి, అది పని చేసే తీరను వివరిస్తూ ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు గ్లయేల్. మాట్లాడినా, నవ్వినా పెదవుల కదలికను అనుకరించి ఎల్ఈడీ లైట్లు ముఖంలోని భావాలను ప్రదర్శిస్తాయి. లైట్స్‌కు కావాల్సిన విద్యుత్‌ను అందించడానికి మాస్క్‌లోనే బ్యాటరీ అమర్చి ఉంటుంది.