చైనాతో గల్వాన్ ఘర్షణ తర్వాత ఆ దేశ యాప్‌లపై నిషేధం వేసిన భారత ప్రభుత్వం.. స్వదేశీ యాప్‌లు రూపొందించాలని ఛాలెంజ్ చేసింది. అయితే ఈ సవాలు విసిరిన 24 గంటల్లోనే.. తొలి సోషల్ మీడియా యాప్ విడుదలైంది. పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ అప్లికేషన్‌కు 'ఎలిమెంట్స్' అనే పేరు పెట్టారు. దీన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్ కలిసి ఆవిష్కరించారు.
1000 మంది నిపుణులు...
ఈ యాప్‌ను 1000 మంది ఐటీ నిపుణులు నెలలు కష్టపడి తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పలు సోషల్‌మీడియా యాప్‌లను క్షుణ్నంగా పరిశీలించి, వాటిలోని ముఖ్యమైన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐస్టోర్‌లో ఉచితంగా లభ్యమవుతోంది.