Tips To Clear Google Space : మీకు Google ఖాతా ఉంటే అందులో ఉచితంగా 15 GB వరకు మాత్రమే వాడుకునే వీలుంది. అందులోనే ఫొటోలు, జీమెయిల్, ఇతరత్రా ఫైల్స్ ఉంచుకోవాలి. ఒక వేళ ఆ స్టోరేజీ నిండిపోతే, డబ్బులు పెట్టి అదనపు స్టోరేజ్ స్పేస్ కొనుక్కోవాల్సిందే. చాలా మంది కొనుక్కుంటారు కూడా. అయితే, ఎలాంటి పెయిడ్ స్టోరేజ్ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వకుండానే కొన్ని సింపుల్ డిజిటల్ క్లీనింగ్ టిప్స్‌తో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లార్జ్ సైజు ఫైళ్లను డిలీట్ చేయాలి!
మీరు ముందుగా చేయాల్సిన పని భారీ సైజు కలిగిన ఫైళ్లను డిలీట్ చేయడం. పెద్దగా ఇంపార్టెంట్ కాని ఫైళ్లను తొలగించడం ద్వారా కొంత స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు. అవి వీడియోలు కావచ్చు, ఫొటోలు కావచ్చు లేదా ఇతర ఫైల్స్ అయినా కావచ్చు. దీని కోసం ముందుగా మీరు మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ స్క్రీన్ ఎడమ వైపున్న స్టోరేజీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు అక్కడ లార్జ్ స్టోరేజీ ఉన్న ఫైల్స్ కనిపిస్తాయి. లేదంటే స్క్రీన్ కుడివైపున్న Storage used పై క్లిక్ చేస్తే ఫైల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు డిలీట్ చేయాలనుకున్న పెద్ద ఫైల్స్‌ని డిలీట్ చేయండి. అవి ట్రాష్‌లోకి వెళ్లిపోతాయి. అందులోకి వెళ్లి Delete Forever ని సెలెక్ట్ చేసుకోవాలి.
మొబైల్లో లార్జ్ సైజ్ ఫైల్స్‌ను డిలీట్ చేయాలంటే, ముందుగా గూగుల్ డ్రైవ్ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ ఎడమ వైపునున్న మెనూపై క్లిక్ చేస్తే కింద స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేస్తే పెద్ద సైజు ఫైల్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన వాటిని డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత Trash లోకి వెళ్లి, దాన్ని Empty చేసుకుంటే స్టోరేజీ ఫ్రీ అవుతుంది.
ఇవి రెండూ కాకుండా ఇంకో ఈజీ మెథడ్ కూడా ఉంది. మీ ఈ-మెయిల్లో లాగిన్ అయి, సెర్చ్‌బాక్స్‌లో has: attachment larger:10MB అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు 10 MB కంటే ఎక్కువ సైజున్న ఫైల్స్ అన్నీ వస్తాయి. అందులో మీకు కావాల్సిన దానిని డిలీట్ చేసుకోండి. మళ్లీ Trash లోకి వెళ్లి అక్కడే డిలీట్ చేయండి.
2. జీమెయిల్లో స్పామ్ ఫోల్డర్‌ను క్లీన్ చేయాలి
జీమెయిల్ అకౌంట్లోని Spam Folder మనకు తెలియకుండానే కొంచెం స్టోరేజీని ఆక్రమించుకుంటుంది. దీన్ని ఖాళీ చేయడం వల్ల కొంచెం స్పేస్ మిగులుతుంది. దానికోసం డెస్క్‌టాప్‌లో జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయి, ఎడమవైపు ఉన్న మెనూపై క్లిక్ చేస్తే Spam Folder కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే Click more పై క్లిక్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది. అందులోకి వెళ్లి Delete all spam messages now ని సెలెక్ట్ చేసుకోవాలి.