వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ వాచ్‌లో 110కి పైగా వర్క్అవుట్ మోడ్లు ఉంటాయని సంస్థ సీఈఓ మంగళవారం ట్వీట్ చేశారు. నడక, ఈత, సైక్లింగ్, పరుగు, క్రికెట్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, బాలే, షూటింగ్ తదితర వర్క్అవుట్ మోడ్స్ అందులో ఉంటాయని సూచిస్తూ ఓ చిన్న వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు.
ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లలో అధిక సంఖ్యలో క్రీడలకు సంబంధించిన ఫీచర్లు కొత్తేమీ కాదు. అమేజ్‌ఫిట్ జీటీఎస్ 2, అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2, హువావే వాచ్ఫిట్, హానర్ వాచ్ ఈఎస్లలో 80కి పైగా స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి.
మార్చి 23 (మంగళవారం) నుంచి అందుబాటులోకి రానుంది వన్ ప్లస్ స్మార్ట్‌వాచ్.
వన్‌ప్లస్ వాచ్ ఫీచర్లు..
⦁ ఇరువైపులా రెండు బటన్లతో రౌండ్ డయల్
⦁ వివిధ వర్క్అవుడ్ మోడ్లు