తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

SpyNote Malware : మొబైల్ యూజర్లకు అలర్ట్​.. నయా స్పైవేర్​తో డేటా చోరీ సహా.. మనీ లూటీ చేస్తున్న హ్యాకర్స్!

SpyNote Malware : సైబర్ నేరగాళ్లు స్పైనోట్ అనే సరికొత్త మాల్​వేర్​తో మొబైల్ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా యూజర్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించి, వారి ఖాతాల్లోని సొమ్మును లూటీ చేస్తున్నారు. అంతేకాదు మీ ఫోన్​ కాల్స్​ను రికార్డ్ చేస్తున్నారు. చివరికి మీ వ్యక్తిగత సందేశాలను కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.

SpyNote Malware
SpyNote

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 3:56 PM IST

SpyNote Malware : సైబర్​ కేటుగాళ్లు రోజురోజుకు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు రకాల ఫేక్​ లింక్స్​ ద్వారా మన డివైజుల్లోకి డేంజరస్​ వైరస్​లు, స్పైవేర్​లు చొప్పించి పర్సనల్​ డేటాను చోరీ చేస్తున్న వీరు.. తాజాగా మరో కొత్త యాప్​తో మోసం చేసేందుకు రెడీ అయ్యారు. కనుక వీరి పట్ల జాగ్రత్తగా ఉండకుంటే మన వ్యక్తిగత సమాచారం మొత్తం ఈ నేరగాళ్ల చేతుల్లోకి పోవడం ఖాయమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీకు తెలియకుండానే..
ఎఫ్-సెక్యూర్ అనే ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ.. సైబర్​ కేటుగాళ్లు మన ఫోన్స్​లోకి 'స్పైనోట్'​ అనే కొత్త రకం మాల్​వేర్​ను పంపిస్తున్నట్లు గుర్తించింది. వీరు మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్​ యూజర్లను టార్గెట్​ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్పైవేర్​(SpyNote) అనే అప్లికేషన్​ మనకి తెలియకుండానే మన డివైజ్​లో ఇన్​స్టాల్​ అయి ఉంటుంది. ఇది మనకి కంటికి కనపడకుండానే సైబర్​ ఎటాకర్​లకు కావాల్సిన మన పర్సనల్​ డేటాను ఎంతో చాకచక్యంగా చేరవేస్తుంది. ముఖ్యంగా ఈ యాప్​ గూగుల్​ ప్లే స్టోర్​ భద్రతా ప్రమాణాలను సైతం దాటి మన డివైజ్​లోకి చొచ్చుకొస్తోందని టెక్​ నిపుణులు అంటున్నారు.

ఎలా డౌన్​లోడ్​ అవుతుంది?
సైబర్ ​క్రిమినల్స్​ ఈ యాప్(SpyNote)​ను స్మిషింగ్​ పద్ధతిలో మన మొబైల్స్​లో ఇన్​స్టాల్​ అయ్యేలా చూస్తున్నారు. అంటే టెక్స్ట్​(SMS) మెసేజెస్​ రూపంలో కొన్ని రకాల ప్రమాదకరమైన లింక్స్​ను ఆండ్రాయిడ్​ యూజర్స్​కు పంపిస్తారు. ఒక వేళ ఎవరైనా వీటిని క్లిక్​ చేస్తే.. ఈ మాల్​వేర్​ యాప్​ మన ఫోన్​లోకి సులువుగా డౌన్​లోడ్​ అయిపోతుంది. వాస్తవానికి ఈ​ మాల్​వేర్ ఒక రెగ్యులర్ ఓఎస్​​ అప్డేట్​ రూపంలో మీ ఆండ్రాయిడ్​ వస్తుంది. దీనిని మీరు నిజమైన అప్డేట్​గా భావించి క్లిక్​ చేసే.. ఆ మాల్వేర్ సులువుగా మీ ఫోన్​లో ఇన్​స్టాల్ అయిపోయే ప్రమాదముందని చెబుతున్నారు సైబర్​ ఎక్స్​పర్ట్స్​.

డేటా చోరీ!
ఈ స్పైనోట్​ మీ ఫోన్​లోని కీలకమైన డేటాను చోరీ చేసి హ్యాకర్లకు అందిస్తుంది. ప్రధానంగా..

  • ఫోన్​ కాల్స్​ డేటా
  • వ్యక్తిగత సందేశాలు
  • మీ బ్యాంక్​ ఖాతా వివరాలు
  • మీడియా ఫైల్స్​ (ఫొటోలు, వీడియోలు)
  • అంతేకాకుండా మీ పర్సనల్​ చాటింగ్​ను కూడా యాక్సెస్​ చేస్తుంది.

ఆండ్రాయిడ్​లో దాక్కుంటుందిలా!
ఆండ్రాయిడ్​ యూజర్స్​ ఈ స్పైనోట్​ను గుర్తు పట్టడం చాలా కష్టం. ఇది మన ఫోన్​లోనే ఉన్నప్పటికీ మనకి అస్సలు కనబడదు. బ్యాక్​గ్రౌండ్​లో ఉంటూ తన పనిని తను చేసుకుంటూ పోతుంది ఈ డేంజరస్​ అప్లికేషన్​. హ్యాకర్లు ఈ మాల్​వేర్​ని యాక్టివేట్​ చేయడానికి.. యూజర్​ ఫోన్​కు 'ఎక్స్​టెర్నల్​ ట్రిగ్గర్​'(External Trigger) అనే సాఫ్ట్​వేర్​ను​ పంపిస్తారు.

యూజర్​ డేటాను ఇలా దొంగిలిస్తుంది!
ఈ SpyNote యాండ్రాయిడ్​ వినియోగదారుడి ప్రైవసీని హరిస్తుంది. ఎందుకంటే ఈ మాల్​వేర్​ మనకు తెలియకుండానే ఫోన్ కాల్స్​ను .wav ఫైల్ ఫార్మాట్‌లో రికార్డ్​ అండ్​ సేవ్​ చేసి కేటుగాళ్లకు పంపుతుంది. మాల్​వేర్​ దాడికి గురైన బాధితుడికి ఇన్‌కమింగ్ కాల్స్​ వచ్చినప్పుడు ఈ ఫోన్​లో బ్రాడ్​కాస్ట్​ రిసీవర్​ ట్రిగ్గర్​ ఎనేబుల్​ అవుతుంది. ఈ బ్రాడ్‌కాస్ట్ రిసీవర్‌లోని కోడ్ సదరు వ్యక్తి కాల్​ ఆన్సర్​ చేశాడని గుర్తించిన వెంటనే మీ కాల్స్​ను రికార్డ్​ చేస్తుంది. కాల్స్​ రికార్డింగ్స్​తో పాటు మొబైల్​లోని మీ మీడియా ఫైల్స్​(.jpeg ఫొటోలు)ను, బ్యాంకింగ్​ పాస్​వర్డ్స్​ను కూడా రికార్డ్ చేసి సైబర్​ క్రిమినల్స్​కు పంపుతుంది.

గమనిక : ఇలాంటి సైబర్​ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. మీ ఫోన్​లకు వచ్చే ప్రతీ లింక్​ను అవగాహన లేకుండా క్లిక్​ చేయకండి. SMS రూపంలోనే కాకుండా వివిధ మార్గాల ద్వారా వచ్చే ఇటువంటి అన్-​నోన్​​ లింక్స్​ లేదా కాల్స్​ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సైబర్​ నిపుణులు సూచిస్తున్నారు.

Top 10 WhatsApp Features : వాట్సాప్​ లాంఛ్​ చేసిన టాప్​ 10 ఫీచర్స్​​ ఇవే.. మీరు వాడుతున్నారా?

X New Subscription Fee : ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. ఏం చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే.. ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details