Someone Blocked Your Number? You Can Still call them :ఏవేవో కారణాలతో.. ఒకరి ఫోన్ నంబర్ మరొకరు బ్లాక్ చేయడం మనకు తెలిసిందే. అయితే.. అత్యవసరంగా ఫోన్ చేయాల్సి వస్తే.. కాల్ కలవదు. ఇలాంటి సమస్య ఫేస్ చేసేవారికి.. రెండు యాప్స్ అందుబాటులోకి వచ్చాయి మరి అవేంటి..? ఎలా వాడాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండికాల్ యాప్(IndyCall App):
- మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి నెంబర్‌కు కాల్ చేయడానికి ఉపయోగించే ఉత్తమ యాప్‌లలో ఇండికాల్ ఒకటి.
- మీరు ఎవరికైనా కాల్ చేయాలంటే ముందుగా Google Play Store నుంచి IndyCall యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఓపెన్ చేయండి.
- మీరు యాప్‌ని తెరిచిన తర్వాత, దానికి అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి.
- తర్వాత లాగిన్‌పై క్లిక్ చేసి, ఆపై మీరు యాప్‌కి లాగిన్ చేయాలనుకుంటున్న Google ఖాతాను ఎంచుకోండి.
- మీరు లాగిన్ చేసిన తర్వాత, మీరు కాల్ చేయడానికి కొన్ని క్రెడిట్‌లను సంపాదించాలి.
- ఆ యాప్‌లో యాడ్స్ చూడడం ద్వారా మీకు ఈ క్రెడిట్స్ వస్తాయి. అంటే.. ఇవి ఒకరమైన పాయింట్స్ అన్నమాట.
- ఇవి ఎన్ని ఉంటే.. అంతసేపు మాట్లాడవచ్చు.
- ఈ క్రెడిట్‌లను సంపాదించడానికి Get Minutes అనే పేరు గల కుడి ఎగువ మూలలో ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత "More Free Minutes"పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీరు క్రెడిట్స్ సంపాదించడానికి యాడ్లను చూడవచ్చు.
- ఈ క్రెడిట్‌లను ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి నంబర్‌కు డయల్ చేసి కాల్ చేయవచ్చు.
- మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న క్రెడిట్స్ తగ్గిపోతూ ఉంటే.. మాట్లాడుతూనే మీరు యాడ్స్ చూడవచ్చు. తద్వారా క్రెడిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి.
- Indycall యాప్‌ని ఉపయోగించడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే.. మీ ఫోన్ నంబర్ స్థానంలో మరో కాలింగ్ ఐడీ నంబర్‌ను కూడా సెట్ చేయవచ్చు.
- ఈ ఆప్షన్ ద్వారా.. మీరు ప్రతిసారీ వేరే నంబర్ ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయవచ్చు.
దూస్రా యాప్(Doosra APP):
- మీ నెంబర్‌ను చూపకుండా ఎవరికైనా కాల్ చేసే అధికారాన్ని అందించే ప్రైవేట్ నెంబర్ కాలింగ్ యాప్‌లలో దూస్రా ఒకటి.
- మీ నంబర్‌ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయడానికి, ముందుగా మీరు Google Play Store నుంచి Doosra యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- యాప్‌ను తెరిచి, అవసరమైన అనుమతులు ఇచ్చిన తర్వాత.. మీరు "Get Doosra Number" పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు ప్రైవేట్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఇది మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయడానికి దీనిని మీరు రిజర్వ్ చేసి కొనుగోలు చేయవచ్చు.
- ఈ పద్ధతిని ఉపయోగించేందుకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
- మీరు ఈ నంబర్‌ను నెలకు 83 రూపాయల ధరతో పొందవచ్చు.
- ప్లాన్‌ని ఎంచుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రభుత్వ పత్రంతో E-Kycని పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీకు ప్రైవేట్ నెంబర్ కేటాయించబడుతుంది.
- ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ నెంబర్ నుంచి ఎటువంటి సమస్య లేకుండా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయవచ్చు.