భారత్‌లో టిక్‌టాక్ నిషేధం తర్వాత.. దాని మార్కెట్‌ను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో కొత్త యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ పేరుతో ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రేసులో ఇప్పుడు గూగుల్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కూడా చేరింది.
ప్రస్తుతానికి భారత్‌లో మాత్రమే..
'షార్ట్స్' పేరుతో టిక్‌టాక్‌కు పోటీగా కొత్త బీటా ఫీచర్‌ను తీసుకొచ్చింది యూట్యూబ్. భారత్‌లో మాత్రమే(ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ) ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అది కూడా మొబైల్ యాప్‌లో మాత్రమే పని చేస్తుంది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు ఈ ఫీచర్‌ను విస్తరిస్తామని యూట్యూబ్ వెల్లడించింది.
యూట్యూబ్ షార్ట్ విశేషాలు..