ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానించడం సహా పలు మార్పులతో గోప్యత పాలసీని ప్రకటించిన నేపథ్యంలో వాట్సప్ యాప్ డౌన్‌లోడ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారం క్రితం కోటి 27లక్షలు ఉన్న వాట్సాప్ డౌన్‌లోడ్‌లు ప్రస్తుతం కోటి 6 లక్షలకు పడిపోయాయి.
వాటికి వరమే..
వాట్సాప్ పోటీ సంస్ధ సిగ్నల్ డౌన్‌లోడ్‌లు గత ఏడాది డిసెంబర్ 29 నుంచి ఈ నెల 5 మధ్య 61 రెట్లు పెరిగిపోయాయి. డిసెంబర్ 29-జనవరి 5 మధ్య 2లక్షల 85 వేల యాప్ డౌన్‌లోడ్‌లు కాగా.. జనవరి 5-12 మధ్య ఏకంగా కోటీ 78లక్షలు అయ్యాయి.
మరో పోటీ సంస్థ టెలిగ్రామ్ సైతం డౌన్‌లోడ్‌లలో దూసుకుపోతోంది. 76లక్షల నుంచి కోటి 57లక్షలు పెరిగాయని 'సెన్సార్ టవర్' సంస్థ తెలిపింది. ఈ మార్పు ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయాలను కోరుకునే వినియోగదారుల అభిరుచిని ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:టెలిగ్రామ్@500 మిలియన్ డౌన్‌లోడ్‌లు