తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

శాస్త్ర, సాంకేతికత రంగాల్లో స్వయం ప్రతిపత్తి - శాస్త్ర, సాంకేతికత రంగాలు

వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోని 3 'సైన్స్​ సూపర్​ పవర్​'లలో ఒకటిగా భారత్​ను నిలపాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది కేంద్రం. అందు కోసం శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఊతమిచ్చేందుకు ఓ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసింది. సాంకేతిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించేలా మరిన్ని నిధుల కేటాయించాలని నిర్ణయించింది.

science and technology
శాస్త్ర, సాంకేతికతలో స్వయం ప్రతిపత్తి

By

Published : Jan 2, 2021, 6:29 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఒక ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసింది. సాంకేతిక రంగంలో స్వయం ప్రతిపత్తి; శాస్త్ర, సాంకేతిక రంగాలకు మరింత మెరుగ్గా నిధులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు; వృత్తి, విద్యా సంస్థల్లో జెండర్‌, సామాజిక ఆడిట్‌ తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోని 3 'సైన్స్‌ సూపర్‌ పవర్‌'లలో ఒకటిగా భారత్‌ను నిలపాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. శాస్త్ర, సాంకేతిక, నూతన ఆవిష్కార విధానం (ఎస్‌టీఐపీ) అనే ఈ ముసాయిదాను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) తాజాగా తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ నెల 25లోగా సూచనలు చేయాలని ప్రజలకు సూచించింది.

  • ఐదేళ్లకోసారి పరిశోధకుల సంఖ్యను, స్థూల జాతీయ వ్యయంలో పరిశోధనలపై పెట్టే వ్యయాన్ని, ప్రైవేటు భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయాలి. శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) రంగంలో వ్యక్తిగత, సంస్థాగత ప్రతిభను ప్రోత్సహించాలి. వచ్చే దశాబ్దంలో అత్యధిక స్థాయిలో అంతర్జాతీయ అవార్డులు లభించేలా చూడాలి.
  • ఎంపిక చేసిన కొన్ని వ్యూహాత్మక రంగాలు, వాణిజ్య వెంచర్లు, అంకుర సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ రంగాల్లోని కొన్ని ప్రాజెక్టులకు ప్రత్యక్ష పెట్టుబడులు సమకూర్చేందుకు ఎస్‌టీఐ అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశోధనలు.
  • ఎస్‌టీఐలో లెస్బియన్లు, ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలి.
  • ఎస్‌టీఐ ద్వారా వెలువడే అన్ని రకాల డేటా, సమాచారాలను భద్రపరిచేందుకు ఒక ఎస్‌టీఐ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి. అందరికీ శాస్త్రీయ డేటా, సమాచారం లభించేలా చూడటానికి 'ఓపెన్‌ సైన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌'ను సిద్ధం చేయాలి.
  • జర్నల్‌ ప్రచురణదారులతో చర్చలు జరిపి, 'ఒకే దేశం, ఒకే చందా' విధానాన్ని సాకారం చేయాలి. ఇందులో కేంద్రీకృత చెల్లింపుల పద్ధతిని ప్రవేశపెట్టాలి. దీనివల్ల దేశంలోని అందరికీ జర్నల్‌ వ్యాసాలు అందుబాటులో ఉంటాయి.
  • ఎస్‌టీఐ విద్యను మెరుగుపరచేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలి. ఆర్థిక వ్యవస్థతో దీన్ని మరింత అనుసంధానించాలి.
Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details