తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Smart Phone: శాంసంగ్‌ గెలాక్సీ మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్లు - శామ్‌సంగ్‌ గెలాక్సీ

మొబైల్​ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్​లో కొత్త ఫోన్​ను తీసుకురానుంది. మడతపెట్టేందుకు వీలైన గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌3, 5జీ స్మార్ట్‌ఫోన్లు భారత్​లో ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయంటే..

SAMSUNG
శామ్‌సంగ్‌ గెలాక్సీ

By

Published : Aug 17, 2021, 10:46 AM IST

టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ తమ అల్ట్రా ప్రీమియం, మడతపెట్టేందుకు వీలైన గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌3 5జీ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబరు 10 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంచనుంది. వీటి ప్రారంభ ధర రూ.84,999. 'శాంసంగ్‌ .కామ్‌' వెబ్‌సైట్‌ సహా ప్రముఖ రిటైల్‌ విక్రయశాలల్లో వీటి కోసం ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. వచ్చే నెల 10 నుంచి విక్రయాలు మొదలవుతాయని శాంసంగ్‌ వెల్లడించింది.

*గెలాక్సీ ఫోల్డ్‌3 5జీ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీతో లభించే స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,49,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ మెమొరీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,57.999గా ఉంది.

*గెలాక్సీ ఫ్లిప్‌ 3 5జీ కూడా రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 128 జీబీ వేరియంట్‌ ధర రూ.84,999 కాగా, 256 జీబీ మోడల్‌ ధరను రూ.88,999గా కంపెనీ నిర్ణయించింది.

ఇదీ చదవండి:ఈ​​ ఫోన్స్​ ఉంటే ఛార్జింగ్ ఆలోచన అక్కర్లేదు!

ABOUT THE AUTHOR

...view details