Samsung Galaxy F34 5G Launch : ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫీచర్స్‌తో మరో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలోకి వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 పేరుతో దీనిని సోమవారం భారత మార్కెట్లోకి లాంఛ్ చేశారు. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ గ్యాడ్జెట్‌ను తమ వినియోగదారులకు అందిస్తుంది శాంసంగ్. బడ్జెట్ ఫ్రెండ్లీగా(Samsung Galaxy F34 5G Price) రూపుదిద్దుకున్న ఈ నయా ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్పై మీరూ ఓ లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ స్పెసిఫికేషన్స్
Samsung Galaxy F34 5G Specifications :
- డిస్ప్లే - 6.46 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ప్లే + 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ - ఇన్‌హౌస్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 1280
- బ్యాటరీ కెపాసిటీ - 6,000mAh
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13 ఆధారిత OneUI 5.1 సాఫ్ట్‌వేర్
- రియర్ కెమెరా- 50 ఎమ్పీ మెయిన్ సెన్సార్ + 8 ఎమ్పీ అల్ట్రావైడ్ లెన్స్ + 2 ఎమ్పీ మ్యాక్రో సెన్సార్
- ఫ్రంట్ కెమెరా- 13 ఎమ్పీ
స్టోరేజ్..
- 6జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్