తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 3:06 PM IST

ETV Bharat / science-and-technology

Repair Mode Option Google : రిపేర్​ సమయంలో ఫోన్​ డేటా పోయిందా? గూగుల్​ నయా ఆప్షన్​తో అంతా సేఫ్!

Repair Mode Option Google : ఫోన్​ పాడయిందని రిపేర్​కు ఇచ్చారా? ఆ సమయంలో ఫ్యాక్టరీ రీసెట్​ కారణంగా డేటా మొత్తం పోయిందా? అయితే బాధపడకండి. గూగుల్​ త్వరలో తేనున్న ఓ కొత్త ఆప్షన్​ ఇక ఆ సమస్యకు చెక్​ పెట్టబోతుంది. మీ మొబైల్​లోని పర్సనల్​ డేటా డిలీట్​ చేయకుండానే మీ డివైజ్​ మీ చేతికి తిరిగి వస్తుంది. మరి ఆ నయా ఫీచర్​ ఏంటి? దీంతో పాటు గూగుల్​ తీసుకురానున్న మరిన్ని కీలక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Google To Launch More New Features Till This December In All Devices
Special Repair Mode Option

Repair Mode Option Google :మొబైల్​ యూజర్స్​ తమ ఫోన్​లను రిపేర్​ కోసం ఇచ్చి తిరిగి దానిని పొందే సమయంలో చాలావరకు తమ వ్యక్తిగత డేటాను మొత్తం కోల్పోతారు. ఇందులో ఫోన్​ నంబర్లతో పాటు ముఖ్యమైన మీడియా ఫైల్స్​ కూడా ఉంటాయి. అయితే ఇలా పోగొట్టుకున్న పర్సనల్​ డేటాను తిరిగి పొందే అవకాశాలు దాదాపు ఉండవు. ఇలాంటి సమయాల్లో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యకు చెక్​ పెట్టేందుకే గూగుల్​ సరికొత్త ఫీచర్​ను తెచ్చేందుకు కృషి చేస్తోంది. దీని సాయంతో రిపేర్​ సమయాల్లో మీ ఫోన్​లోని వివరాలన్నింటినీ భద్రంగా లాక్​ చేసుకొని ఉంచుకోవచ్చు. మీ అనుమతితో.. అంటే మీరు సృష్టించే పాస్​వర్డ్​ లేదా ఫేస్​ లాక్​ లేకుండా దానిని మొబైల్​ సర్వీస్ సెంటర్​ సహా ఎవరూ యాక్సెస్​ చేయలేరు.

ఆండ్రాయిడ్​ 14 ఓఎస్​తో వచ్చే ఫోన్​లలో..
ఇందుకోసం గూగుల్​ త్వరలోనే రిపేర్​ మోడ్ ​( Repair Mode ) అనే ఆప్షన్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమస్యకు రానున్న కొత్త ఆండ్రాయిడ్​ వర్షెన్​తో ముగింపు పలకాలని గూగుల్​ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ నయా ఫీచర్​ ( Repair Mode Feature​ ) లేదా అప్డేట్​ను ఆండ్రాయిడ్​ 14 ఓఎస్​తో వచ్చే ఫోన్​లలో చేర్చాలని సంస్థ భావిస్తున్నట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఈ 'రిపేర్​ మోడ్​' రిపేర్​ సమయాల్లో మీ ఫోన్​ను​ సర్వీస్​ సెంటర్​కు ఇచ్చినట్లుగా గుర్తించి అందులో ఉన్న డేటాను హైడ్​ చేసుకుంటుంది. దీనిని మీరు మాత్రమే యాక్సెస్​ చేయగలరు. దీంతో రిపేర్​ చేసే వ్యక్తికి మీ మొబైల్​లో డేటా ఉందనే అనుమానం రాకుండా​ చేస్తుంది. దీంతో కొత్త అకౌంట్​తో నూతన ఓఎస్​ లేదా న్యూ వెర్షన్​ను మీ డివైజ్​లో ఇన్​స్టాల్​ చేసేందుకు వీలు కలుగుతుంది. అయితే సాధారణంగా ఫోన్​ రిపేర్​కు ఇచ్చినప్పుడు సర్వీస్​ సెంటర్లు మీ పర్సనల్​ డేటాను మొత్తం తొలగించాలని కోరుతాయి. ఇక రానున్న ఈ కొత్త అప్డేట్​తో డేటా లాస్​ అనే సమస్యలేమి ఉండవు.

ఇతర తయారీదారులు కూడా..
ఈ నయా మోడ్ ఫీచర్​​ను కేవలం గూగుల్​ పిక్సెల్​ ఫోన్​లకు మాత్రమే పరిమితం చేయకుండా Android 14 AOSPని ఉపయోగించి వేర్వేరు మొబైల్​ మ్యానుఫ్యాక్చర్లు కూడా దీనిని ఇన్​బిల్ట్​ ఫీచర్​గా తమ ఉత్పత్తుల్లో వాడుకునే వెసులుబాటును కూడా కల్పించనుంది గూగుల్​. లేదా ఇదే పద్ధతిలో ఉండే తమ సొంత టూల్స్​ను కూడా ఇన్​స్టాల్​ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్​ను గూగుల్​ పిక్సెల్స్​ ఫోన్​ల ద్వారా వినియోగదారులకు తొలుత అందుబాటులోకి తేనున్నారు. క్రమంగా Android 14 QPR1 బీటా బిల్డ్​ వెర్షన్​ రూపంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆండ్రాయిడ్​ డివైజ్​ యూజర్స్​ కూడా ఈ ఫీచర్​ను ఆస్వాదించే అవకాశం ఉంది.

రిపేర్​ మోడ్​ కోసం ప్రత్యేక యాప్​..
మొబైల్​ రిపేర్ సమయంలో​ యూజర్స్​​ పోగొట్టుకునే పర్సనల్​ డేటాను తిరిగి రిట్రీవ్​ చేసే విధానాన్ని మరింత సులభతరం చేసేందుకే గూగుల్​ తన ప్రయత్నాలు చేస్తున్నట్లు టెక్​ ఎక్స్​పర్ట్​స్​ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ రిపేర్​ మోడ్ ​బీటా బిల్డ్​ వెర్షన్​లోకి రావడానికి డిసెంబర్​ కల్లా ఎందుకు సమయం పట్టనుందనే కారణాలను వివరిస్తూ.. ఈ ఫీచర్​ను ఉపయోగించేందుకు అనుసరించాల్సిన స్టెప్స్​ను తెలియజేస్తూ ఉన్న యాప్​ను కూడా గూగుల్​ త్వరలోనే లాంఛ్​ చేయనుంది.

మొత్తంగా ఆండ్రాయిడ్​ 14 వెర్షన్​తో వచ్చే డివైజుల్లో ఈ Repair Modeను ఎనేబుల్​ చేయడం ద్వారా మొబైల్​ యూజర్స్​ ఇక నుంచి తమ ఫోన్​లను సర్వీస్​ సెంటర్లకు డేటా పోతుందనే భయం లేకుండా నిశ్చింతగా ఇచ్చుకోవచ్చు.

గూగుల్​ క్లాక్​లో మరికొన్ని కొత్త ఫీచర్లు..
గూగుల్​ క్లాక్​కు సంబంధించి కూడా కంపెనీ మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. త్వరలో రానున్న ఈ కొత్త అప్డేట్​లు​ పనితీరు విషయానికి వస్తే.. మీరు కొత్తగా అలారాన్ని సెటప్ చేసేటప్పుడు క్లాక్ యాప్ 'వెదర్ ఫోర్‌కాస్ట్' అనే కొత్త ఆప్షన్​ను చూపించనుంది. ఇది అలారం ఆఫ్​ చేసినప్పుడు మీరు ఉండే ప్రదేశంలోని వాతావరణ సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది.

అయితే ప్రస్తుతానికి ఈ 'వెదర్​ ఫోర్​కాస్ట్' ఫీచర్​ను పిక్సెల్​ డివైజ్​ యూజర్స్​లో ప్రీ-ఇన్​స్టాల్​డ్​గా ఉన్న పిక్సెల్ వెదర్​ యాప్​లో మాత్రమే గమనించవచ్చు. అంటే Android 14 QPR1 బీటా ద్వారా నడిచే Pixel 8 లేదా Pixel 8 ప్రో ఫోన్​లలో మాత్రమే అందుబాటులో ఉంది. క్రమంగా దీనిని కూడా డిసెంబరు నాటికి అన్ని మొబైల్​ యూజర్స్​కు అందుబాటులోకి తేనున్నారు.

అలారం సింక్రనైజ్​ ఆప్షన్​..
త్వరలో రానున్న ఈ కొత్త ఫీచర్(Alarm Sync Otion) సాయం​తో మీ ఫోన్​, పిక్సెల్ వాచ్​ల మధ్య కూడా అలారాలను సింక్రనైజ్​ చేసుకోవచ్చు. WearOS 3లోని పిక్సెల్ వాచ్, WearOS 4లోని పిక్సెల్ వాచ్ 2 రెండింటిలో ఈ ఫీచర్​ పనిచేస్తుందని టెక్​ నిపుణుడు మిషాల్​ రెహ్మాన్ చెప్పారు.

ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ డివైజ్​ యూజర్స్​ కోసం గూగుల్​ ప్రవేశపెట్టనున్న మరికొన్ని కీలక మార్పులు ఇవే..

  • మొబైల్​ Chromeలో URL కరెక్షన్స్​ సజెషన్స్ ( Corrections Suggestions Feature )ఫీచర్‌ను కూడా గూగుల్​ యాడ్​ చేస్తుంది.
  • ఈ ఫీచర్​ క్రోమ్​లో యూజర్​ ఎంటర్​ చేసే పదాల్లో ఏమైనా అక్షరదోషాలు ఉంటే వాటిని ఆటోమెటిగ్గా గుర్తించి సరి చేస్తుంది.
  • ఈ ఫీచర్​ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వెబ్​ యూజర్స్​కు అందుబాటులో రాగా.. తాజాగా దీనిని మొబైల్​ వినియోగదారులకు కూడా అందించనున్నట్లు గూగుల్​ మంగళవారం తెలిపింది.
  • మొత్తంగా ఈ ఫీచర్​ యూజర్ సెర్చ్​ బాక్స్​లో టైప్​ చేసే వాటిల్లో అక్షరదోషాలను గుర్తించి సవరించడంలో సహాయపడుతుంది. కాగా, దీనిని త్వరలోనే అడ్రస్​ బార్​లో యాడ్​ చేయనున్నారు.
  • మీరు టైప్​ చేసే తప్పు పదాల కారణంగా కొన్ని సార్లు మీకు ఫేక్​​ వెబ్​సైట్​లు దర్శనమిస్తుంటాయి. వాటి జోలికి కూడా పోకుండా ఈ ఫీచర్​ నియంత్రిస్తుంది.
  • ఇవే కాకుండా గూగుల్​ మ్యాప్స్​లో Screen Reader Support For Lens In Maps అనే కొత్త ఫీచర్​ను కూడా గూగుల్​ త్వరలో ప్రవేశపెట్టనుంది. లైవ్ వ్యూ సెర్చ్ అని పిలిచే మ్యాప్స్‌లోని లెన్స్.. ఫోన్ స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న ఆసక్తికర అంశాలను మరింత క్షుణ్ణంగా చదవగలుగుతుంది. దృష్టిలోపం ఉన్నవారికి, నిరక్షరాస్యులకు ఈ ఫీచర్​ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది. కాగా, ఈ ఫీచర్​ ఈ వారంలో iOS యూజర్స్​కు ఏడాది చివర్లో ఆండ్రాయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
  • ట్రాన్సిట్​ నావిగేషన్​లో తేనున్న మరిన్ని ఫీచర్లు మీరు ప్లాన్ చేసుకునే ట్రిప్స్​కు ఎంతో ఉపయోగపడతాయి.
  • అదనంగా Google తన పిక్సెల్ ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులకు కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్‌లను కూడా జోడిస్తోంది. Pixel 5, నూతన వినియోగదారులు తమ కెమెరాలోని మ్యాగ్నిఫైయర్​ యాప్‌లో పలు మార్పులు చేస్తోంది. చిన్న వస్తువులను చూడటంలో ఇబ్బంది ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • మరో కొత్త ఫీచర్ గైడెడ్ ఫ్రేమ్(Guided Frame Feature). ఇది దృష్టిలోపం ఉన్న వినియోగదారులు మెరుగైన సెల్ఫీలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గైడెడ్ ఫ్రేమ్ ప్రస్తుతం పిక్సెల్ 8, పిక్సెల్​ 8 ప్రోలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో పిక్సెల్ 6 సహా ఇతర డివైజుల్లోకి రానుంది.
  • చివరగా అసిస్టెంట్ రొటీన్స్ ఫీచర్‌(Assistant Routines Feature)ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది వినియోగదారులు జాబ్​ నుంచి ఇంటికి వచ్చినప్పుడు లైట్లను ఆన్ చేయడం, సంగీతాన్ని ప్లే చేయడం లాంటి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్‌లను సెటప్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్​ను యాక్సెసిబిలిటీ ఫంక్షనాలిటీ సాయంతో ఆస్వాదించవచ్చు.

Top 10 WhatsApp Features : వాట్సాప్​ లాంఛ్​ చేసిన టాప్​ 10 ఫీచర్స్​​ ఇవే.. మీరు వాడుతున్నారా?

X New Subscription Fee : ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. ఏం చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే.. ఎంతంటే?

SpyNote Malware : మొబైల్ యూజర్లకు అలర్ట్​.. నయా స్పైవేర్​తో డేటా చోరీ సహా.. మనీ లూటీ చేస్తున్న హ్యాకర్స్!

ABOUT THE AUTHOR

...view details