Redmi Note 13 Series Launch :చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ షావోమీ మరో మిడ్-రేంజ్ రెడ్మీ మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్ పేరుతో ఈ ప్రోడక్ట్‌ను గురువారం జరిగిన ఓ ఈవెంట్లో లాంఛ్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని Xiaomi ఇండియా అధికారిక YouTube ఛానెల్లో ప్రత్యక్షప్రసారం చేశారు. కాగా, ఈ సిరీస్ మోడల్ గతేడాది సెప్టెంబర్‌లోనే చైనాలో లాంఛ్ అయింది. ఇక 3 మోడళ్లలో రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్ ఫోన్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఐఫోన్ 15 కెమెరా కంటే మెరుగ్గా!
Redmi Note 4Gతో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన షావోమీ తన 10 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటోంది. Redmi Note 13 Pro+ 5G కెమెరా పనితీరు ప్రస్తుతం హవా సృష్టిస్తోన్న iPhone 15 Pro Maxతో పాటు శామ్సంగ్ S23 అల్ట్రా కంటే మెరుగ్గా ఉన్నాయని రెడ్మీ కంపెనీ పేర్కొంది. Redmi Note 13 Pro+ 5G జనవరి 10న ఉదయం 10 గంటలకు Mi.com, Mi Home, Flipkartతో పాటు Xiaomi రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ.2,000 వరకు డిస్కౌంట్స్‌ను పొందవచ్చని తెలిపింది. ఇక రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.
Redmi Note 13 5G సిరీస్ మోడళ్లు :
- Redmi Note 13 5G క్లాసిక్
- Redmi Note 13 Pro 5G
- Redmi Note 13 Pro Plus 5G
200 MP కెమెరా
Redmi Note 13 Pro+ 5G మొదటి 'ట్రూ' 200MP కెమెరాను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. కెమెరాకు సంబంధించి మెరుగైన ఫొటోలు, వీడియోల క్వాలిటీ కోసం శామ్సంగ్, MediaTek సంస్థలతో కలిసి పనిచేసినట్లు వివరించింది షావోమీ.
HyperOS స్క్రీన్
Redmi డివైజ్ ప్రియులు ఎంతగానో వేచి చూసిన Xiaomi కొత్త HyperOS స్కిన్‌ను తాజాగా విడుదల చేసిన Redmi Note 13 5G సిరీస్‌లో గమనించవచ్చు. దాదాపు అన్ని డివైజుల్లో పనిచేసేలా దీని ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు రెడ్మీ తెలిపింది.