భారతీయ ఆన్లైన్ గేమర్స్‌కు శుభవార్త. నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ తిరిగి 'పబ్‌జీ: న్యూ స్టేట్'(PUBG New State) పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 11న(Pubg new state India release date) విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్ చేశారట. గూగుల్ ప్లేస్టోర్‌లో దీని సైజ్ దాదాపు 1.4జీబీ ఉండగా.. ఆండ్రాయిడ్ 6 ఆపై వర్షన్లలో మాత్రమే ఈ గేమ్ ఆడటానికి వీలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆధునాతన ఆయుధాలు, వాహనాలతో పాటు.. ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు పబ్‌జీ సృష్టికర్త క్రాఫ్టన్ సంస్థ చెబుతోంది.
ETV Bharat / science-and-technology
Pubg New State: భారత్‌లోకి సరికొత్తగా పబ్‌జీ.. ఆ ఫోన్లలో మాత్రమే! - pubg new state india release date
చైనాతో వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ తిరిగి 'పబ్‌జీ: న్యూ స్టేట్'(PUBG New State ) పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఆధునాతన ఆయుధాలు, వాహనాలతో పాటు.. ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు పబ్‌జీ సృష్టికర్త క్రాఫ్టన్ సంస్థ చెబుతోంది.
భారత్‌లో పబ్‌జీ గేమ్‌కు వచ్చిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల మంది భారతీయులు ఈ గేమ్‌ను ఆడటానికి ఇష్టపడ్డారు. అయితే, చైనాతో వివాదం నేపథ్యంలో గతేడాది పబ్‌జీని భారత్‌లో నిషేధించారు. దీంతో కొన్నాళ్లపాటు భారత్‌లోని యువత ఆ ఆటకు దూరమైంది. అయితే, భారతీయ యూజర్లను వదులుకోవడం ఇష్టం లేని.. క్రాఫ్టన్ సంస్థ 'బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ)' (Battleground mobile India) పేరుతో ప్రత్యేకంగా దేశీయ గేమ్‌ను రూపొందించింది. ఇప్పుడు క్రాఫ్టన్.. పబ్‌జీలో మార్పులు చేస్తూ.. సరికొత్త 'పబ్‌జీ: న్యూ స్టేట్' గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
ఇదీ చూడండి:ఐఫోన్ సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేశారా? ఓసారి చూడండి!