తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫ్రీగా వన్​ప్లస్​ ఇయర్​ బడ్స్​.. ఆఫర్​ ఒక్కరోజు మాత్రమే.. పొందాలంటే ఇలా చేయండి - వన్​ప్లస్​ ఇయర్​ బడ్స్​ ఆఫర్​

మార్కెట్​లో వ‌న్​ప్ల‌స్ ఉత్ప‌త్తుల‌కు ఉన్న క్రేజ్ వేరు. అవి మొబైల్ ఫోన్ల‌యినా, ఇయ‌ర్ బడ్స్ అయినా. వీటిని కొనాలంటే మిగ‌తా వాటితో పోలిస్తే కొంచెం ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నే. అలాంటి వ‌న్​ప్ల‌స్ నార్డ్ ఇయ‌ర్ బ‌డ్స్ ఉచితంగా పొంద‌వ‌చ్చు. అదెలాగంటే..

oneplus offer on nord buds ce
oneplus offer on nord buds ce

By

Published : Apr 11, 2023, 7:41 AM IST

ఎల‌క్ట్రానిక్ రంగంలో వ‌న్​ప్ల‌స్ బ్రాండ్​కు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఈ కంపెనీ నుంచి వ‌చ్చిన ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. అటు టీవీల‌తో పాటు ఇటు మొబైల్ ఫోన్లు, సంబంధిత గ్యాడ్జెట్స్​ను త‌యారు చేస్తూ ఈ రంగంలో దూసుకుపోతుంది వ‌న్​ప్ల‌స్. మేలైన ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తూ వినియోగదారుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయితే వ‌న్​ప్ల‌స్ తాజాగా ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ ఇయర్ ఫోన్స్ అయిన 'వ‌న్​ప్ల‌స్ నార్డ్ బ‌డ్స్'ను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. అయితే దీనికి కొన్ని నిబంధ‌న‌లు పెట్టింది.

వన్​ప్లస్​ ఉత్ప‌త్తి చేసిన ఫోన్లు సామాన్యుల‌కు అందుబాటులో ఉండేవి కావు. వాటిని కొందరు మాత్ర‌మే కొనుగోలు చేసేది. అయితే ఈ మ‌ధ్య కాలంలో త‌మ ఉత్ప‌త్తులు అంద‌రూ వాడాలనే ఉద్దేశంతో సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా, త‌క్కువ ధ‌ర‌కే ప‌లు ఫోన్లను తీసుకొచ్చింది వన్​ప్లస్​. ఇలా తీసుకొచ్చిన వాటిల్లో నార్డ్ సిరీస్ ఒక‌టి. నార్డ్, నార్డ్ 2, సీఈ 2, నార్డ్ 2టీ త‌దిత‌ర ఫోన్లను మార్కెట్​లో విడుద‌ల చేసింది. అయితే ఈ సంస్థ ఇటీవ‌ల 'వ‌న్​ప్ల‌స్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' మొబైల్​ను రూపొందించింది. దీన్ని ఈ నెల 11న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఇండియాలో విడుదల చేయనుంది. ఈ సంద‌ర్భంగా ఒక కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఫోన్ కొన్న వారు.. రూ.2,999 విలువైన 'వ‌న్​ప్ల‌స్నార్డ్ ఇయ‌ర్ బ‌డ్స్'ను ఉచితంగా పొందే అవ‌కాశం క‌ల్పించింది. అయితే ఈ ఆఫ‌ర్ పొందాలంటే వినియోగ‌దారులు సీఈ 3 లైట్ మొబైల్​ను వ‌న్ ప్ల‌స్ వెబ్ సైట్‌, స్టోర్లు, అమెజాన్ నుంచి మాత్ర‌మే కొనుగోలు చేయాలి. ఇలా చేసిన వారు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్​కు అర్హులు.

ఈ మొబైల్ ఫోన్ దిగ్గ‌జ సంస్థ ఈ నెల 4న హాంకాంగ్​లో జ‌రిగిన 'లార్జ‌ర్ దెన్ లైఫ్' అనే కార్య‌క్ర‌మంలో 'నార్డ్ సీఈ 3 లైట్' మొబైల్ ఫోన్​తో పాటు నార్డ్ ఇయ‌ర్ బ‌ర్డ్స్​ను విడుద‌ల చేసింది. ఈ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్, త‌క్కువ ధ‌ర ఉండ‌టం వ‌ల్ల మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో కంపెనీ వినియోగదారుల‌కు ఆఫ‌ర్ ప్ర‌కటించింది. ఈ మొబైల్ ఏప్రిల్ 11న, మ‌ధ్య‌ాహ్నం 12 గంట‌లకు ఒపెన్ సేల్​కు వ‌స్తుంది. అప్ప‌టి నుంచి ముందుగా తెలిపిన ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వారికి ఆ ఒక్క రోజు ఇయ‌ర్ బ‌ర్డ్స్ ఉచితంగా ఇవ్వ‌నుంది. ఇది లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ అని తెలిపింది.

ఇవీ ఫోన్‌ ప్ర‌త్యేక‌త‌లు :'వ‌న్​ప్ల‌స్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' మొబైల్ ధ‌ర ఇండియాలో రూ.19,999 గా ఉంది. ఇది 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం గ‌ల బ్యాట‌రీ, 67 వాట్ సూపర్ ప‌వ‌ర్ చార్జ‌ర్​తో వ‌స్తుంది. 8 జీబీ, 12 ర్యామ్ వేరియంట్ల‌లో దొరుకుతుంది. 108 మెగా పిక్సెల్ గ‌ల కెమెరా, క్వాల్ క‌మ్ స్నాప్ డ్రాగ‌న్ 695 చిప్ దీని ప్ర‌త్యేక‌త‌లు. 17.07 సెం.మీ పొడ‌వుతో డ్యూయల్ స్టీరియో స్పీక‌ర్ సదుపాయంతో వ‌స్తుంది. పాస్టెల్ లైమ్, క్రొమాటిక్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ కూడా వ‌స్తుంది. అంతే కాకుండా ఈ ఫోన్ తీసుకున్న వినియోగ‌దారులు వ‌న్ ప్ల‌స్ వెబ్ సైట్, స్టోర్లల్లో 'వ‌న్ ప్ల‌స్ నార్డ్' స్మార్ట్ వాచ్​ను ఏప్రిల్ 12 - 15 తేదీల మ‌ధ్య కొనుగోలు చేస్తే రూ. 1000 త‌గ్గింపు లభిస్తుంది. అదే 16 - 30 తేదీల మధ్య కొంటే రూ.500 తగ్గింపు వ‌ర్తిస్తుంది.

ఇవీ చదవండి :5జీ స్మార్ట్​ఫోన్ కొనాలా? వీటిపై ఓ లుక్కేయండి.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

మీ పిల్లలు ఫోన్​లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలా..? అయితే ఇలా చేయండి

ABOUT THE AUTHOR

...view details