ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. అందుకే మొబైల్ కంపెనీలు కూడా మార్కెట్లోకి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్లకు దీటుగా కొత్త మోడల్స్‌ను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ గ్రేడ్ ఫీచర్లతో వచ్చే ఫోన్ల పట్ల వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో వన్ ప్లస్, శాంసంగ్, రియల్ మీ, పోకో లాంటి బ్రాండెడ్ మొబైల్ కంపెనీలు ఫ్లాట్ షిప్ గ్రేడ్ ఫీచర్లతో కూడిన మొబైల్స్‌ను తక్కువ రేటులో అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. అయితే వీటిన్నంటి ధర రూ.30000 వరకు ఉండవచ్చు!
వన్ ప్లస్ నార్డ్3:
2023లో అందరిలో ఆసక్తిని రేపుతున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో వన్ ప్లస్ నార్డ్ 3 ఒకటి. చైనాలో వన్ ప్లన్ ఏస్ 2వీ పేరుతో, ఇండియాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాల్లో వన్ ప్లస్ నార్డ్ 3 పేరుతో ఈ ఫోన్ రాబోతోంది. మిడ్ టెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ, 1.5కే రెజల్యూషన్ AMOLED, 120Hz రీఫ్రెష్ రేట్, 64MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇందులో 16MP సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై తర్వాత ఈ ఫోన్ లాంఛ్ అవ్వనుందని సమాచారం. దీని ధర ఇండియాలో దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని అంచనా.
పోకో ఎఫ్5:
మరికొద్దిరోజుల్లో ఈ ఫోన్‌ను పోకో ఇండియా లాంఛ్ చేయనుంది. డ్రాగన్ 7+ జెన్ ఎస్ఓసీ, AMOLED స్క్రీన్, 120Hz రీఫ్రెష్ రేట్, గ్లాస్ శాండ్ విచ్ డిజైన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. 64MP ప్రైమరీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీని ధర కూడా రూ.30వేల దగ్గర్లో ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.