జియో, గూగుల్ కలిసి తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్టఫోన్‌ను తీసుకొస్తామని ప్రకటించిన నాటి నుంచి.. ఆ ఫోన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. దాని అప్డేట్స్(JioPhone Next update) కోసం నెట్లో వెతుకుతూనే ఉన్నారు. అలాంటి వారికోసం దీపావళికి ముందే.. జియోఫోన్ నెక్స్ట్కు సంబంధించి అప్డేట్స్ను(JioPhone Next latest news) వీడియో రూపంలో విడుదల చేసింది జియో. 'మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్స్ట్' పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ఫోన్ ఫీచర్లు, తయారీ వెనుకున్న ఉద్దేశం గురించి వివరించారు. దీపావళికే(jio phone next launch date) దీనిని వినియోగదారులకు మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
సరికొత్త ఓఎస్‌తో..
జియోఫోన్ నెక్స్ట్(JioPhone Next news) కోసం గూగుల్, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను(ఓఎస్) రూపొందించాయి. తక్కువ ధరకు గొప్ప అనుభూతిని అందిస్తూనే.. అందరినీ 'ప్రగతి'లోకి తీసుకురావాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని అత్యుత్తమ టెకీలు దీనిని అభివృద్ధి చేశారని జియో ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఓఎస్‌ను కేవలం భారత్ కోసమే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
జియోఫోన్ నెక్స్ట్ లో.. క్వాల్కామ్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీంతో ఫోన్ పనితీరు, ఆడియో, బ్యాటరీలో ఆప్టిమైజేషన్‌లతో పాటు కనెక్టివిటీ, లొకేషన్ టెక్నాలజీ వంటివి సమర్థంగా పని చేస్తాయని జియో ప్రతినిధులు తెలిపారు.
ఫీచర్ల వివరాలు
వాయిస్ అసిస్టెంట్
వాయిస్ అసిస్టెంట్.. ఫోన్‌ను ఆపరేట్ చేయడం, యాప్స్‌ను తెరవడం సహా ఎన్నో రకాలుగా యూజర్‌కు ఉపయోగపడుతుంది. దీని సాయంతో వినియోగదారుడికి తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సమాచారం/కంటెంట్‌ను సులభంగా పొందవచ్చు.
గట్టిగా చదవడం..
స్కీన్‌పై ఉన్న కంటెంట్‌ను స్పష్టంగా, గట్టిగా చదివి వినిపించే సౌకర్యం ఈ ఫోన్లో ఉంది. ఫలితంగా అంధులు సైతం ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
అనువాదం