తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

IPhone 15 Discount Offers : ఐఫోన్ 15 సిరీస్​పై భారీ డిస్కౌంట్స్​.. యాపిల్ వాచ్​లపై కూడా.. ధరలు ఎలా ఉన్నాయంటే? - amazon discounts on iphone 15 series

IPhone 15 Discount Offers In Telugu : ఐఫోన్ లవర్స్​ అందరికీ వెరీ గుడ్​ న్యూస్​. యాపిల్ ఆఫీషియల్ రీసెల్లర్​ స్టోర్స్​​​ సహా అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, క్రోమా లాంటి ఈ-కామర్స్​ సైట్స్​.. లేటెస్ట్ ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​ ఫోన్​లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. అలాగే యాపిల్ వాచ్ సిరీస్​ 9, వాచ్ ఆల్ట్రా 2 లపై కూడా మంచి ఆఫర్స్​ అందిస్తున్నాయి. మరి వాటి పూర్తి వివరాలు మనమూ తెలుసుకుందామా?

apple watch Discount Offers
IPhone 15 Discount Offers

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 12:07 PM IST

IPhone 15 Discount Offers 2023 : యాపిల్ కంపెనీ ఉత్పత్తులను అభిమానించే వారందరికీ గుడ్​ న్యూస్​. యాపిల్​ ప్రొడక్ట్​ ప్రీమియల్ సెల్లర్​ imagine.. సరికొత్త ఐఫోన్​ 15, ఐఫోన్ 15 ప్లస్​, వాచ్​ ఆల్ట్రా 2, వాచ్​ సిరీస్​ 9లపై భారీ డిస్కౌంట్స్​ ప్రకటించింది. అలాగే అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, క్రోమా ఈ-కామర్స్ సైట్​ల్లోనూ ఇవి భారీ తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్​లపై భారీ డిస్కౌంట్స్​
IPhone 15 Series Discount Offers :

  • యాపిల్ ప్రీమియం​ రీసెల్లర్స్ ఇమేజిన్​​ ఇస్తున్న డిస్కౌంట్స్ ఫలితంగా.. ఐఫోన్​ 15 ఇప్పుడు కేవలం రూ.38,900 లకే లభిస్తుంది.
  • ఐఫోన్​ 15 ప్లస్​ బేస్ వేరియంట్​ రూ.48,000 ధరకే దొరుకుతుంది.

యాపిల్ వాచ్​లపై భారీ తగ్గింపు
Apple Watch Discount Offers :

  • యాపిల్ ప్రీమియం సెల్లర్ ఇమేజిన్​ ఇస్తున్న డిస్కౌంట్​ ఆఫర్​తో.. యాపిల్​ వాచ్​ ఆల్ట్రా 2 ఇప్పుడు రూ.63,000లకే లభిస్తుంది.
  • వాచ్ సిరీస్​ 9 రూ.27,400లకే దొరుకుతుంది.
    యాపిల్ వాచ్​ సిరీస్​ 9

క్యాష్ బ్యాక్​, ఎక్స్ఛేంజ్​ బోనస్​ కూడా..
imagine వెబ్​సైట్​లో ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​, వాచ్ సిరీస్​ 9, వాచ్ అల్ట్రా 2 లను.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.5000 ఇన్​స్టాంట్​ క్యాష్​బ్యాక్ లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్​ బోనస్​గా మరో రూ.6000 ఆదా అవుతుంది.

30 శాతం తగ్గింపు
imagine వెబ్​సైట్​లో మీరు కనుక కొత్త యాపిల్ ప్రొడక్ట్స్​.. ప్రీ-ఆర్డర్​ పొందినట్లు అయితే, యాపిల్​కేర్​ ప్రొటెక్ట్ +​పై 30% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు జీఎస్​టీ ఇన్​వాయిస్​పై కూడా అదనపు డిస్కౌంట్​ దొరుకుతుంది.

సెప్టెంబర్​ 22 నుంచి..
యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్​ 15 ప్లస్​, ఐఫోన్​ 15 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​; వాచ్ ఆల్ట్రా 2, వాచ్​ సిరీస్​ 9లను లాంఛ్ చేసింది. ఇవన్నీ కూడా సెప్టెంబర్​ 22 (శుక్రవారం) నుంచి యాపిల్ స్టోర్​లలో అందుబాటులో ఉంటాయి.

భారత్​లో ఐఫోన్ సిరీస్ ధరలు
IPhone 15 Series Price In India :

  • యాపిల్ స్టోర్​ ప్రకారం, ఇండియాలో ఐఫోన్​ 15 ధర రూ.79,999.
  • ఐఫోన్​ 15 ప్లస్​ ధర రూ.89,999
  • ఐఫోన్​ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ రెండూ కూడా చెరో నాలుగు స్టోరేజీ వేరియంట్స్​తో అందుబాటులో ఉన్నాయి.
  • ఐఫోన్ 15 ప్రో ధరలు రూ.1,34,900 నుంచి రూ.1,84,900 రేంజ్​లో ఉన్నాయి.
  • ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్​ ధరలు రూ.1,59,90 నుంచి రూ.1,99,900 ప్రైస్ రేంజ్​లో ఉన్నాయి.
    ఐఫోన్​ 15 ప్రో డిస్కౌంట్​ ఆఫర్స్​

ఈ-కామర్స్ సైట్లలో
అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, క్రోమాల్లో.. ఐఫోన్ 15 సిరీస్​ ప్రీ-ఆర్డర్స్​పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

Croma
లేటెస్ట్ యాపిల్ ప్రొడక్ట్స్​ను క్రోమా ఆన్​లైన్​ సైట్​లోనూ, స్టోర్​లోనూ బుక్​ చేసుకోవచ్చు. అయితే ఆన్​లైన్​ కంటే క్రోమా స్టోర్​లోనే బెస్ట్ ఆఫర్స్ లభిస్తాయి. ఆన్​లైన్​లో ప్రీ-బుకింగ్ ఆర్డర్​ ఇస్తే.. మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిజికల్ స్టోర్​కు వెళితే..కేవలం రూ.2000 చెల్లించి ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు.

క్రోమా - డిస్కౌంట్స్​

  • క్రోమా స్టోర్​లో హెచ్​డీఎఫ్​సీ కార్డ్ ఉపయోగించి ఐఫోన్​ 15 సిరీస్​, యాపిల్ వాచ్​లు కొనుగోలు చేస్తే.. రూ.5000 ఫ్లాట్​ డిస్కౌంట్ లభిస్తుంది.
  • పాత స్మార్ట్​ఫోన్​ ఎక్స్ఛేంజ్​ చేస్తే.. గరిష్ఠంగా రూ.6000 వరకు ఆదా అవుతుంది.
  • 24 నెలల వరకు నో-కాస్ట్​ ఈఎంఐ సౌలభ్యం లభిస్తుంది.
  • సెప్టెంబర్​ 18లోపు ప్రీ-ఆర్డర్ పెడితే.. క్రోమా సన్​బర్న్ క్రూయిజ్​ కంట్రోల్​ 4.0 టికెట్స్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

అమెజాన్ - డిస్కౌంట్స్​
అమెజాన్​లో హెచ్​డీఎఫ్​సీ కార్డ్​లు ఉపయోగించి ఐఫోన్ 15 సిరీస్, యాపిల్ వాచ్​లు కొనుగోలు చేస్తే.. రూ.5000 తక్షణ డిస్కౌంట్​ లభిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అమెజాన్​ సెప్టెంబర్​ 23 నుంచే షిప్పింగ్​ కూడా ప్రారంభిస్తుంది.

ఐఫోన్ 15

ఫ్లిప్​కార్ట్​ - డిస్కౌంట్స్​
ఐఫోన్ లవర్స్​కు ఫ్లిప్​కార్ట్​ అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తోంది.

  • కోటక్ బ్యాంక్​ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఐఫోన్​ 15 సిరీస్​, యాపిల్ వాచ్​లను ప్రీ-ఆర్డర్ చేస్తే.. ఇన్​స్టాంట్​గా 10% డిస్కౌంట్​ లభిస్తుంది.
  • హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డ్​ ద్వారా ప్రీ-ఆర్డర్​ చేస్తే.. రూ.5000 ఫ్లాట్ డిస్కౌంట్​ అందుతుంది.
  • పాత ఫోన్​ ఎక్స్ఛేంజ్ ఆఫర్​ కింద ఐఫోన్​ 15 దాదాపు రూ.51 వేలు తగ్గింపు ధరతో లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details