తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Iphone 13 Price: దీపావళి ఆఫర్‌.. ఐఫోన్‌ 13పై రూ.24,000 తగ్గింపు! - ఐఫోన్​ 13 ధరలు

ఇటీవల విడుదలైన ఐఫోన్​ 13పై ఆకట్టుకునే ఆఫర్​ను ప్రకటించింది యాపిల్​ సంస్థ. దీపావళి సందర్భంగా రూ.79,900 విలువైన ఐఫోన్‌ 13ను డిస్కౌంట్‌లో రూ.55,900కే అందుబాటులోకి తేనుంది. అది ఎలాగంటే..

iphone latest news
ఐఫోన్​

By

Published : Nov 1, 2021, 1:32 PM IST

యాపిల్‌ ఐఫోన్‌ (iphone 13 Price).. ఈపేరు వింటే చాలు.. చాలా మంది బుర్రల్లో ఒక్కటే ఆలోచన. మనం ఎప్పుడు కొంటామా? అని. ఎందుకంటే.. సాధారణంగానే ఐఫోన్‌ ధరలు ఆకాశాన్నంటుతాయి. అలా అని అందరూ కొనలేరని కాదు. చాలా మంది ఎవరి ఖర్చులకు తగ్గట్లుగా వారు ప్రణాళికలు వేసుకొని.. ధరలు కొంచెం (iphone 13 Price) తగ్గిన తర్వాత కొందాములే అనుకుంటుంటారు. అలాంటి వారికి దీపావళి పండుగ ఒక చక్కని అవకాశం అని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీ రూ.79,900 విలువైన ఐఫోన్‌ 13ను డిస్కౌంట్‌లో రూ.55,900కే ఇవ్వనుంది. అది ఎలాగంటే..

ఐఫోన్​ 13

దీపావళి సందర్భంగా ఐఫోన్‌ 13 కొనాలనుకునేవారికి యాపిల్‌ భారీ డిస్కౌంట్‌ (iphone 13 Price) ప్రకటించింది. అసలు ధరతో పోల్చి చూసుకుంటే దాదాపు రూ.14 వేల నుంచి రూ.24 వేల వరకు తగ్గనుంది. యాపిల్‌ రిటైల్‌ స్టోర్స్‌లో ఎక్కడైనా ఈ ఆఫర్‌ను ఎవరైనా పొందొచ్చు. యాపిల్‌ ఐఫోన్‌ అసలు ధర రూ.79,900 ఉండగా.. డిస్కౌంట్‌, ఎక్స్‌ఛేంజ్‌, క్యాష్‌బ్యాక్‌ పోను రూ.55,900కు రానుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మీరు ఈ సమాచారాన్ని చెక్‌ చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 13.. @ రూ.55,900 ఇలా..

ఐఫోన్‌ 13 అసలు ధర, ఆఫర్‌ ధరకు మధ్య రూ.24,000 వ్యత్యాసం ఉంది. ఎలాగంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్స్‌ మీద రూ.6000 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు. ఇంకా మీ దగ్గర పాత ఐఫోన్‌ ఎక్స్​ఆర్​ 64 జీబీ ఉండి, మంచి కండిషన్‌లో ఉంటే.. ఎక్స్‌ఛేంజ్‌ కింద రూ.15000 వరకు పొందవచ్చు. దీనికి రూ.3000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ అదనం. ఎక్స్‌ఛేంజ్‌లో మీరు ఇంకేమైనా మోడల్స్‌ ఇవ్వాలనుకుంటే.. కంపెనీ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆ మోడల్స్‌, ఫోన్‌ కండిషన్‌కు తగ్గట్టుగా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఐదు కలర్స్​లో ఐఫోన్​ 13
ఐఫోన్​ 13

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. యాపిల్‌ ఐఫోన్‌ 13.. 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. ప్రధాన కెమెరా 12 మెగాపిక్సల్స్‌ (ఎంపీ) కాగా వీడియోల కోసం సినిమాటిక్ మోడ్ ఫీచర్‌ అందిస్తున్నారు. ఐఫోన్ 12 మోడల్స్‌లో కంటే ఐఫోన్ 13లో అధిక స్టోరేజ్‌ (128జీబీ) సామర్థ్యం ఇస్తున్నారు. లేటెస్ట్‌ ఏ15 బయానిక్‌ చిప్‌, ఐఓఎస్‌ 15తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ, 3,227 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, 20వాట్స్​ ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చూడండి :అదిరే ఫీచర్లతో రూ.14 వేలలోపు స్మార్ట్​ఫోన్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details