తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

iPhone ఐఫోన్ బంపర్​ ఆఫర్​- 12 సిరీస్​పై భారీ డిస్కౌంట్​

Iphone 12 series: ఐఫోన్ 12 సిరీస్‌పై యాపిల్ భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 మినీ కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్​ పొందవచ్చు.

iPhone
ఐఫోన్ 12 సిరీస్‌పై బంపర్​ ఆఫర్‌.

By

Published : Jan 10, 2022, 7:28 AM IST

iphone 12 series: దిగ్గజ కంపెనీ యాపిల్ మొబైల్స్‌ (iPhone) వాడాలని ఉన్నా.. వాటి ధరను చూసి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే యాపిల్‌ కంపెనీ ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. తగ్గింపులో ఐఫోన్‌ను పట్టేయడానికి కాచుకూర్చొని ఉంటారు. అలాంటి వారికి సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఇదో బంపరాఫర్!

ఐఫోన్ 12 సిరీస్‌పై యాపిల్ భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 మినీ కొనుగోలు చేస్తే ప్రస్తుతం భారీ తగ్గింపును పొందవచ్చు. డ్యూయల్‌ సిమ్‌ (నానో+ఇ-సిమ్‌) వచ్చే ఈ రెండు మోడల్స్‌ను యాపిల్‌ ఏ14 బయోనిక్‌ చిప్‌, స్పోర్ట్‌ సూపర్‌ రెటినా XDR OLED డిస్‌ప్లేతో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 6.1, 5.4 అంగుళాల స్క్రీన్‌, 12 ఎంపీ డ్యూయల్‌ రియల్‌, వైడ్‌ యాంగిల్‌, అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలతో ఈ మోడల్స్‌ను తొలుత ఐఓఎస్‌ 14తో యాపిల్‌ లాంచ్‌ చేసింది. ఆపై ఐఓఎస్‌ 15కి అప్‌డేట్ చేసింది.

ఆఫర్లు ఇవే..

ఐఫోన్‌ 12- 64 జీబీ వేరియంట్‌ అసలు ధర ₹65,900 ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో దీని సవరించిన ధర ₹53,999, అమెజాన్‌లో ₹63,900గా ఉంది. అలాగే ఐఫోన్‌ 12- 128 జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ₹64,999 ఉండగా, అమెజాన్‌లో ₹63,900గా ఉంది. మరోవైపు ఐఫోన్‌ 12 మినీ 64 జీబీ అసలు ధర ₹59,900 ఉండగా, ఫ్లిప్‌కార్డులో ₹40,900, అమెజాన్‌లో ₹53,900గా అందుబాటులో ఉంది. అయితే, మోడల్స్‌లో రంగులను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. కాగా, ఐఫోన్‌ 12 సిరిస్‌పై యాపిల్‌ గతంలోనూ భారీ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:ఏసీ, టీవీ, ఫ్రిజ్​ ధరలకు రెక్కలు.. ఎంత పెరుగుతాయంటే...

ABOUT THE AUTHOR

...view details