శాస్త్ర సాంకేతిక విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్ అన్నారు. తద్వారా ఉమ్మడి లక్ష్యాల సాధన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తోందన్నారు. రాష్ట్రాల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి సైన్స్ అనేది ఏకీకృత సాధనమని స్పష్టం చేశారు.
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(ఐఐఎస్ఎఫ్)-2020లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వివిధ ప్రముఖులు, మంత్రులు, నిపుణులతో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. ఇందులో పాల్గొన్న రాష్ట్రాల మంత్రులు.. కరోనా అనంతరం జీవనోపాధి అంశాలపై చర్చించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడాన్ని భారత్ సదా విశ్వసిస్తుంది.