తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీకు తెలియకుండా మీ ఫోన్ డేటా సేకరిస్తోంది.. తెలుసా?

స్మార్ట్​ఫోన్​ వాడటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. వినియోగించడమైతే జరుగుతుంది కానీ వ్యక్తిగత గోప్యత విషయంలో మాత్రం చాలా మందికి.. కనీస అవగాహన ఉండదు. ఆధునిక యుగంలో డేటా ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. భవిష్యత్​ ఇది ఇంకా కీలకం కానుంది. మరి అలాంటి డేటాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి? మీరు వాడే ఫోన్లలో ఈ డేటా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

How to protect personal data in Android
డేటాను భద్రపరుచుకోవడం ఎలా

By

Published : Jul 25, 2021, 4:21 PM IST

ప్రతి ఒక్కరికి డేటా ప్రైవసీ అనేది ఇప్పుడు అత్యంత కీలకం. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం వేరే వారి చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఆధునిక యుగంలో అన్ని పనులకు స్మార్ట్​ఫోన్ వినియోగించడం పెరిగిపోయింది. మరి అందులో ఉన్న మీ వ్యక్తిగత, ఆర్థిక పరమైన సున్నిత సమాచారాన్ని ఎలా కాపాడుకోవడం చాలా మఖ్యం. అదెలానో ఇప్పుడు చూద్దాం.

వాటిని తేలిగ్గా తీసుకోకూడదు..

కొన్ని సెట్టింగ్స్​తో మీకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా డిఫాల్ట్​గా ఎనేబుల్ అయి ఉంటాయి. మరికొన్ని మ్యాప్స్ డేటా షేరింగ్ లాంటివి వ్యక్తిగత అభిష్టాలకు అనుగుణంగా ఎనేబుల్​ చేసుకునేవి ఉంటాయి. అయితే ఇలాంటి వాటి వల్ల కూడా సున్నితమైన డేటా లీకయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీకు ఉపయోగం లేని సెట్టింగ్స్​ను డిసేబుల్ చేయడం మేలు.

యాడ్స్ పర్సనలైజేషన్

గూగుల్ మీ అభిష్టానికి అనుగుణంగా ప్రకటనలను ఇస్తుంది. మీ డేటాను సేకరించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకు.. మీరు ల్యాప్​టాప్​ కొనుగోలు కోసం.. గూగుల్​లో సెర్చ్ చేశారనుకోండి. ఆ తర్వాత వేరే ఇతర యాప్​లు వాడినప్పుడు, వేరే వెబ్​సైట్లు చూస్తున్నప్పుడు.. అందులో మీకు ల్యాప్​టాప్​లకు సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా వస్తుంటాయి.

యాడ్స్ పర్సనలైజేషన్ డిసేబుల్ చేయటం ద్వారా ఇలాంటి ప్రకటనలను తగ్గించుకోవచ్చు.

ఎలా డిసేబుల్​ చేయాలి?

గూగుల్ యాప్​లో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్​ కనిపిస్తుంది. అక్కడ డిసెబుల్​ ఆప్షన్​పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

గూగుల్ ప్లే ఇన్​స్టంట్ ఉపయోగం

చాలా మంది ఒక్క సారి అవసరానికి యాప్​ డౌన్​లోడ్ చేస్తుంటారు. ఆ యాప్ అడిగిన ప్రతి పర్మిషన్స్​ను ఇస్తుంటారు. అవసరం అయిపోయాక.. ఆ యాప్​లను అన్​ ఇన్​స్టాల్​ చేస్తుంటారు. అయినప్పటికీ.. యాప్​లు మీ డేటాను సేకరిస్తుంటాయి. కొన్ని యాప్​లు డిలిట్​ అకౌంట్ సదుపాయాన్ని అస్తుటాయి. దీని ద్వారా ఆ యాప్​లు డేటాను సెకరించడం ఆపేస్తాయి. కొన్ని యాప్​లు మాత్రం ఈ సదుపాయం ఇవ్వవు.

అలాంటి యాప్​లను వినియోగించేందుకు.. గూగుల్​ప్లే ఇన్ స్టంట్ అనే ఫీచర్​ను కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇన్ స్టాల్ చేసుకునే ముందే యాప్​ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్​తో వ్యక్తిగత డేటా థర్డ్ పార్టీ యాప్​ల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఎలా చేయాలి?

గూగుల్​ప్లే యాప్ సెట్టింగ్స్​లో జనరల్ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో గూగుల్ ప్లే ఇన్ స్టంట్​ను ఎనేబుల్ చేసుకుని.. వినియోగించుకోవచ్చు.

ప్రైవసీ సెట్టింగ్స్/డేటా యూసేజ్ షేరింగ్

సెండ్ డయగ్నోస్టిక్ డేటా, రిసీవ్ మార్కెటింగ్ ఇన్ ఫర్మేషన్ వంటి ఆప్షన్​లతో స్మార్ట్​ఫోన్.. డేటా షేరింగ్​ అనుమతి అడుగుతుంది. వీటికి చాలా మంది అనుమతి ఇస్తుంటారు. దీని వల్ల స్మార్ట్​ఫోన్ కంపెనీలు మీ డేటాను సేకకరిస్తుంటాయి. అందుకే ఈ ఆప్షన్​ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డేటా సేకరించే ఆప్షన్​ను ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.

ఎలా చేయాలి?

ఫోన్ సెట్టింగ్స్​లో ప్రైవసీ ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో యూసేజ్ అండ్ డయగ్నోస్టిక్​ను క్లిక్ చేశాక... ఆఫ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

గూగుల్ లోకేషన్

ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా గూగుల్ మన లోకేషన్​ను ట్రాక్ చేయొచ్చు. ఎప్పుడు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు? దగ్గర్లోని చూడదగ్గ ప్రాంతాలు తదితరాలను వినియోగదారులకు ఈ డేటాను ఉపయోగించుకుంటుంది గూగుల్​. ఇది కాస్త ప్రయోజనకరమైందే అయినప్పటికీ.. మీరు తిరిగే ప్రతి ప్రాంతం వివరాలను గూగుల్ స్టోర్​ చేసుకుంటుంది. అందుకే అవసరమైనప్పుడు తప్ప మిగతా అన్ని సార్లు లొకేషన్ డేటాను ఆఫ్ చేసుకోవడం మంచిది.

ఎలా చేయాలి?

సెట్టింగ్స్​లో లోకేషన్ ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో గూగుల్ లొకేషన్ హిస్టరీపై క్లిక్​ చేయాలి. అక్కడ లోకేషన్ హిస్టరీ ఉంటుంది.. దానిని డిసేబుల్ చేసుకోవాలి.

నోటిఫికేషన్లు ఆపేయండి

ఆండ్రాయిడ్​లో అన్ని నోటిఫికేషన్లు లాక్ స్కీన్​పై చూసుకోవచ్చు. ఈ-మెయిల్స్, ఓటీపీ సంబంధింత సందేశాలు ఎవరికైనా చాలా ముఖ్యమైనవి. పబ్లిక్​గా ఫోన్​ను ఉపయోగించేటప్పుడు ఇది సురక్షితం కాదు. అందుకే ఈ ఫీచర్​ను ఆఫ్​ చేయాలి.

ఎలా చేయాలి?

సెట్టింగ్స్​లో నోటిఫికేషన్స్ అనే ఆప్షన్​ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఫోన్​లో ఉన్న అన్ని యాప్స్ కనిపిస్తాయి. అందులో ఏ యాప్​ అవసరం నోటిఫికేషన్ లాక్​ స్క్రీన్​పై అవసరం లేదో దానిని డిసేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

ఇదీ చదవండి:ఫోన్ పోయిందా? గూగుల్ పే, పేటీఎంలను బ్లాక్ చేసేయండిలా..

ABOUT THE AUTHOR

...view details