తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్​ గుడ్​ న్యూస్​.. క్లౌడ్​ స్టోరేజీ 15GB నుంచి 1TBకి పెంపు.. కానీ వారికి మాత్రమే!

గూగుల్ వర్క్​స్పేస్​ వినియోగదారులకు గుడ్​ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం 15 జీబీగా ఉన్న వ్యక్తిగత క్లౌడ్​ స్టోరెజీని 1టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఎలాంటి అప్​గ్రేడ్​ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

google cloud storage increase
google cloud storage increase

By

Published : Nov 1, 2022, 4:37 PM IST

Updated : Nov 1, 2022, 4:51 PM IST

ఫొటో, ఫైల్​, డ్యాకుమెంట్​ లాంటివన్నింటినీ గూగుల్​ క్లౌడ్​ స్టోరేజీలో అప్​లోడ్​ చేసుకుంటాం. కానీ స్టోరేజీ సామర్థ్యం 15 జీబీ మాత్రమే ఉండడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. డబ్బులు పెట్టి అప్​గ్రేడ్​ చేసుకోలేకపోతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేలా వర్క్​స్పేస్​ వినియోగదారులకు గుడ్​ న్యూస్ చెప్పింది గూగుల్. ప్రస్తుతం 15 జీబీగా ఉన్న వ్యక్తిగత క్లౌడ్​ స్టోరేజీ సదుపాయాన్ని 1టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికోసం అకౌంట్​ అప్​గ్రేడ్​ చేసుకోవాల్సిన అవసరం లేదని గూగుల్​ తన బ్లాగ్​స్పాట్​లో పేర్కొంది.

వీటితో పాటు పీడీఎఫ్​, క్యాడ్​ లాంటి 100 రకాల ఫైల్స్​ను డ్రైవ్​లో స్టోర్ చేసుకునేలా అనుమతిచ్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్​ ఫైల్స్​ను కన్వర్ట్ చేయకుండానే ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. మాల్​వేర్​, స్పామ్​, ర్యామ్సన్​వేర్ లాంటి వైరస్​ల నుంచి ఫైల్స్​ను రక్షించేలా ఇన్​బిల్ట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఏకకాలంలో అనేక మందికి మెయిల్​ చేసే కొత్త అప్​డేట్​ను ప్రవేశపెట్టింది సంస్థ. దీంతో ఫార్వర్డ్ మెయిల్​ కాకుండా ప్రతిఒక్కరికీ ప్రత్యేకంగా మెయిల్​ చేసినట్లు ఉంటుంది. వీటిని అన్​సబ్​స్క్రైబ్​ చేసే అవకాశాన్ని కల్పించింది.

మరోవైపు గూగుల్​ వర్క్​స్పేస్​ సేవలను మరిన్ని దేశాలకు విస్తరించింది. ఈ జాబితాలో ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా, తైవాన్​, థాయిలాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్​, బెల్జియం, ఫిన్​లాండ్, గ్రీస్​, అర్జెంటీనా దేశాలు ఉన్నాయి. జూమ్​ రూమ్​ నుంచి గూగుల్​ మీట్​లోకి సులువుగా కనెక్ట్ అయ్యేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్​ చెప్పింది. వివిధ సంస్థలు తమ ఉద్యోగులతో సులభంగా సమావేశం నిర్వహించుకునేందుకే ఈ సదుపాయాన్ని తీసుకువస్తున్నామని పేర్కొంది.

ఇవీ చదవండి:రెండో 'మెదడు' కావాలా?.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

మార్కెట్​లో చౌకగా దొరికే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్​లు ఇవే

Last Updated : Nov 1, 2022, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details