Google Maps Upcoming Features For Indian Users :దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ గూగుల్, భారతీయ యూజర్ల కోసం ప్రత్యేకంగా అనేక గూగుల్ మ్యాప్స్ ఫీచర్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దిల్లీలో జరిగిన 'బిల్డింగ్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా, త్వరలో లైవ్ వ్యూ వాకింగ్, లెన్స్ ఇన్ మ్యాప్స్ సహా, ఫ్యూయెల్ ఎఫీషింట్ రూటింగ్, అడ్రస్ డిస్క్రిప్టర్స్, వేర్ ఈజ్ మై ట్రైన్ లాంటి ఫీచర్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లకే ఫస్ట్ ఛాన్స్!
ఈ నయా గూగుల్ మ్యాప్స్ ఫీచర్లు మొదటిగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. తరువాత వాటిని ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తేనున్నారు.
టాప్ ఫీచర్స్
Google Maps Features :
- వేర్ ఈజ్ మై ట్రైన్ ఫీచర్ :గూగుల్ మ్యాప్స్ రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వేర్ ఈజ్ మై ట్రైన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా మన ట్రైన్ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ముంబయి, కోల్‌కతా లోకల్ ట్రైన్స్ గురించి మాత్రమే తెలియజేస్తుంది. ఈ ఫీచర్‌ను 2024 ప్రథమార్థంలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
- అడ్రస్ డిస్క్రిప్టర్స్ :గూగుల్ మ్యాప్స్‌కు 2024 మొదట్లోనే ఈ అడ్రస్ డిస్క్రిప్టర్స్ ఫీచర్‌ను అనుసంధానం చేసే అవకాశం ఉంది.
- లైవ్ వ్యూ వాకింగ్ ఫీచర్ :భారతదేశంలోని 3000 నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఐఓఎస్ డివైజ్‌లకు కూడా దీనిని అందుబాటులోకి తేనున్నారు.
- ఫ్యూయెల్ ఎఫీషియంట్ రూటింగ్ : 2024 జనవరిలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా పచ్చని ఆకు గుర్తు ఉన్న ఎకో-ఫ్రెండ్లీ రూట్లను మనం తెలుసుకోవచ్చు. మొదటిగా 20 ప్రధాన నగరాల్లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- లెన్స్ ఇన్ మ్యాప్స్ :ఈ ఫీచర్‌ను కూడా 2024 జనవరిలోనే తీసుకురానున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, మీ ఫోన్ కెమెరా ఉపయోగించి, స్థానిక సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.