Google Contacts App Latest Feature : మనం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతాం. లేదా ఏదైనా ఫంక్షన్‌కు వెళతాం. మనతో వచ్చిన పిల్లలు లేదా పెద్దలు అప్పుడప్పుడూ తప్పిపోతూ ఉంటారు. దీనితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక, చాలా కంగారు పడిపోతూ ఉంటాం.
కొన్నిసార్లు మనం కొత్త ఊరు వెళతాం లేదా సిటీకి వెళ్తాం. ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను/ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, వారి లొకేషన్ తెలియక ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ 'గూగుల్ కాంటాక్ట్స్ యాప్' సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఫోన్ నంబర్ ఉంటే చాలు, సదరు యూజర్ కరెంట్ లొకేషన్‌ను ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్ ఎనేబుల్ చేసుకోండిలా!
How To Enable Google Contacts Live Tracker Feature : గూగుల్ కాంటాక్ట్స్ యాప్ 4.22.37.586680692 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ నయా ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే?
- ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని Settings ఓపెన్ చేయాలి.
- Apps సెక్షన్‌లోని Google Contacts ను సెలెక్ట్ చేసుకోవాలి.
- వెంటనే మీకు యాప్ ఇన్ఫో కనిపిస్తుంది. దీనిలోనే గూగుల్ కాంటాక్ట్స్ యాప్ వెర్షన్ నంబర్ కనిపిస్తుంది.
- లేటెస్ట్ 4.22.37.586680692 వెర్షన్ ఉంటే ఓకే. లేదంటే వెంటనే ఫోన్‌ను అప్డేట్ చేసుకోండి. అంతే సింపుల్!
నోట్ : ఒక వేళ యాప్ అప్డేట్ చేసినా 4.22.37.586680692 వెర్షన్ రాకపోతే, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ వెర్షన్ ఒక క్రమ పద్ధతిలో రోల్అవుట్ అవుతోంది. కనుక త్వరలోనే మీకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. మీ ఫోన్లో కనుక గూగుల్ కాంటాక్ట్స్ యాప్ లేనట్లయితే.. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి, లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్లోడే చేసుకోవచ్చు.