యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ ఉంటుంది దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాట్సాప్ వినియోగం మరింత అనువుగా ఉండేలా.. మరికొన్ని సరికొత్త అప్డేట్లను సిద్ధం చేస్తోంది మెటా యాజమాన్యం. నూతన ఫీచర్లు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి. త్వరలో అని పరీక్షలను పూర్తి చేసుకొని.. వియోగదారులుకు ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ అవి ఏంటో తెలుసుకుందాం.
Undo button for deleted messages: మనం ఎవరికైనా మెసేజ్ చేసిన తర్వాత దానిని వద్దనుకుంటే డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. ఒక అరగంటలోపు ఆ మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా అవసరమైన మెసేజ్‌ను పొరపాటుగా డిలీట్ కొడితే ఎలా..? మళ్లీ దాన్ని ఎలా తిరిగి పొందాలి? అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు 'అన్ డూ' ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ ఆప్షన్‌తో డిలీట్ చేసిన సందేశాలన్నింటినీ తిరిగి పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది.
Edit message feature: వాట్సాప్‌లో త్వరలో మెసేజ్ 'ఎడిట్' బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లో ఏవైనా పొరబాట్లు ఉంటే దాన్ని డిలీట్ చేయడం తప్పితే మరో అవకాశం లేదు. అలా కాకుండా.. మెసేజ్ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని ఈ 'ఎడిట్' ఆప్షన్ కల్పించనుంది. ప్రస్తుతం దీనిపై వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో అనే వెబ్‌సైట్ వెల్లడించింది.
Media visibility: వాట్సాప్ తీసుకొస్తున్న 'మీడియా విజిబిలిటీ' ఫీచర్ ద్వారా యూజర్లకు సరికొత్త అనుభూతి అందనుంది. ఈ కొత్త ద్వారా వినియోగదారులు తాము వాట్సాప్‌లో ఓపెన్ చేసే ఫొటోలు, వీడియోలను ఫోన్ గ్యాలరీలో కనిపించకుండా చేయవచ్చు. అందుకు యూజర్లు వాట్సాప్‌లో సెట్టింగ్స్, డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ విభాగంలోకి వెళ్లి కింద ఉండే మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్‌కు ఉన్న టిక్ మార్క్ తీసేయాలి. దీంతో ఫోన్ గ్యాలరీలో వాట్సాప్ ఫొటోలు, వీడియోలు కనిపించవు. ఐఫోన్ యూజర్లయితే 'సేవ్ టూ కెమెరా రోల్' డిసేబుల్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయోగం పూర్తయ్యాక.. త్వరలోనే యూజర్లందరికీ పూర్తిస్థాయిలో ఈ ఫీచర్ లభిస్తుంది.
Save disappearing messages: వాట్సాప్‌లో 'డిస్‌అప్పియరింగ్ మెసేజ్' ఫీచర్ ఇప్పటికే అందరికీ అందుబాటులోకి ఉన్న సంగతి తెలిసిందే. నిర్దిష్ట కాంటాక్ట్‌కు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే.. ఎంచుకున్న సమయానికి అనుగుణంగా మెసేజ్‌లను వాటంతటవే ఆటోమేటిక్‌గా వాట్సాప్ డిలీట్ చేస్తుంది. అయితే, ఈ ఫీచర్ ద్వారా కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లు కూడా డిలీట్ అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.