తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

భూమిపైకి గ్రహాంతర ధూళి వెల్లువ! - అంతరిక్ష ధూళి ఎక్కడ సేకరిస్తారు

రోజు రోజుకు వాతావరణంలో ధూళి పెరిగిపోతోంది. ఇందుకు వాహనాలు, ఫ్యాక్టరీలు, తవ్వకాల వంటివి ప్రధాన కారణం. అయితే అంతరిక్షం నుంచి కూడా ధూళి కణాలు భూమిని ముంచెత్తుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ ధూళి ఎలా భూమిపై పడుతోంది? దీనిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

What is space dust
అంతరిక్ష ధూళి అంటే ఏమిటి

By

Published : May 13, 2021, 12:29 PM IST

గనుల తవ్వకాలు, వాహనాల కాలుష్యం ఇతరత్రా కారణాల వల్ల మన వాతావరణంలో ధూళి పెరిగిపోతోందని తరచూ వింటుంటారు. కానీ, అంతరిక్షం నుంచి కూడా ధూళి ముంచెత్తుతోందని తెలుసా!

ఫ్రెంచ్‌ పోలార్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ఫ్రెంచ్‌ జాతీయ శాస్త్ర పరిశోధన కేంద్రం (సీఎన్‌ఆర్‌ఎస్‌), పారిస్‌ శాక్లే యూనివర్సిటీ, నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నిర్వహించిన పరిశోధన ప్రకారం తోకచుక్కలు, లఘు గ్రహాలు (ఆస్టరాయిడ్ల) నుంచి ఏటా 5,200 టన్నుల సూక్ష్మ ఉల్కలు మన భూమిని తాకుతున్నాయి. ఇవి భూ వాతావరణంలో రాగానే నిప్పు కణికల్లా మండిపోతాయి. వాటిలో కొన్ని సూక్ష్మ ఉల్కలుగా భూమిని చేరతాయి.

రెండు దశాబ్దాలుగా అన్వేష యాత్రలు

ఇవి మిల్లీమీటరులో పదో వంతు నుంచి వందో వంతు వరకు ఉంటాయి. ఈ సూక్ష్మ ధూళిని సేకరించటానికి, వీటి గురించి అధ్యయనం చేయటానికి సీఎన్‌ఆర్‌ఎస్‌ పరిశోధకులు జీన్‌ దుప్రట్‌ నేతృత్వంలో రెండు దశాబ్దాలుగా అంటార్కిటికాలోని ఫ్రాంకో-ఇటాలియన్‌ కన్‌కోర్డియా స్టేషన్‌ (డోమ్‌ సీ) వద్ద ఆరు అన్వేష యాత్రలు నిర్వహించారు. ఇక్కడ మంచు సాంద్రత తక్కువ. భూగోళం నుంచి వచ్చే ధూళి కూడా ఉండదు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

డోమ్‌ సీ వద్ద చదరపు మీటరు ప్రాంతంలో పడే అంతరిక్ష ధూళిని పరిశీలించి ఆ ప్రకారం భూగోళం మొత్తానికి లెక్కగట్టారు. ఇలా చూస్తే ఏటా 5 వేల టన్నులకు పైగా సూక్ష్మ ఉల్కలు భూమిని చేరుతున్నాయి! వీటిలో దాదాపు 80 శాతం తోకచ్కుల నుంచి, మిగిలినవి ఆస్టరాయిడ్ల నుంచి వస్తున్నట్లు అంచనా. భూమి పుట్టినప్పుడు నీరు, కర్బన అణువులు ఏర్పడటంలో ఇవి ఎలాంటి పాత్ర పోషించాయన్నది అర్థం చేసుకోటానికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆక్సిజన్​ అసలు కథ తెలుసా?

ABOUT THE AUTHOR

...view details