తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ ఫోన్లో కీలక ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నారా?.. జాగ్రత్త!

మీ ఏటీఎం కార్డు పిన్​ నెంబర్, ఇతర కీలక డేటాను ఎలా భద్రపరుస్తున్నారు? స్వయంగా గుర్తుపెట్టుకుంటారా? లేక ఎక్కడైనా రాసిపెట్టుకుంటారా? ఒక వేళ ఆ సమాచారాన్ని ఫోన్​లో కనుక సేవ్ చేస్తే! (online safety).. ఇక అంతే సంగతులు!

Digital Security
సైబర్ భద్రత

By

Published : Sep 13, 2021, 4:35 PM IST

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్​పై అధికంగా ఆధారపడుతున్నాం. ప్రత్యేకించి ఈ-కామర్స్​ వెబ్​సైట్లలో షాపింగ్​ కోసం ఎక్కువగా బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నాం. దీనివల్ల చాలామంది తమ డెబిట్, క్రిడిట్ కార్డు, ఏటీఎం పిన్, ఆధార్ కార్డు, పాన్ నెంబర్​ లాంటి వివరాలను తమ ఫోన్ లేదా మెయిల్​లో సేవ్ చేసుకుంటున్నారు.

అయితే ఇలాంటి అలవాటు వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు సాంకేతిక నిపుణులు. ఆ డేటాను హ్యాకర్లు దుర్వినియోగం (Cybercrime) చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇటీవలే జరిగిన ఓ సర్వేలోనూ చాలామంది తమ బ్యాంకు కార్డుల వివరాలు, ఇతర కీలక సమాచారాన్ని భద్రపరిచేందుకు సురక్షిత విధానాలను (Digital Security) పాటించడంలేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 393 జిల్లాల్లో 24వేల మందిపై లోకల్​సర్కిల్స్​ అనే సంస్థ ఈ సర్వే చేసింది.

సర్వేలోని కీలక అంశాలు..

ఎవరికైనా పిన్ చెప్పారా?

ప్రశ్నకు స్పందించిన 8,158 మందిలో 29 శాతం మంది తమ క్రెడిట్, డెబిట్​ కార్డు ఏటీఎం పిన్​ను 'ఒకరు లేదా అంతకన్నా ఎక్కవ మంది'తో పంచుకున్నామని తెలిపారు. 4శాతం మంది తమ పనివారితో షేర్ చేసుకున్నామన్నారు. 65శాతం మంది ఎవరితోనూ అలాంటి సమాచారం పంచుకోలేదని వెల్లడించారు.

పిన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు?

దీనికి 8,260 మంది స్పందించగా, వారిలో 21 శాతం మంది బ్యాంక్ అకౌంట్ నెంబర్, డెబిట్, క్రెడిట్ కార్డు సీవీవీ నెంబర్, ఏటీఎం పిన్, ఆధార్ లేదా పాన్ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని స్వయంగా గుర్తుపెట్టుకుంటున్నట్లు తెలిపారు. 39 శాతం మంది పేపర్​పై రాసిపెట్టుకున్నట్లు వెల్లడించారు.

అయితే 33 శాతం మంది మాత్రం ఫోన్​, ఈమెయిల్, కంప్యూటర్​లలో డిజిటల్​ రూపంలో భద్రపరుస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత గోప్యతకు (privacy) గ్యారంటీ లేని విధంగా.. దాదాపు 11 శాతం మంది ఫోన్​ కాంటాక్ట్​ లిస్ట్​ రూపంలో కీలక సమాచారాన్ని స్టోర్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఇలా చేస్తే తక్కువ ధరకే పెట్రోల్​, డీజిల్!

ABOUT THE AUTHOR

...view details