Designtech MD Vikaskhan Wilkar Claims No Corruption in AP Skill: స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని డిజైన్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖాన్ విల్కర్ స్పష్టం చేశారు. స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని వెల్లడించారు. అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన సామగ్రి సరఫరా చేసినట్లు డిజైన్‌టెక్ ఎండీ తెలిపారు. పరికరాలు బాగా లేకున్నా, రిపేరు వచ్చినా బాధ్యత తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో ఈ మేరకు షరతు ఉందని వెల్లడించారు. జీఎస్టీ కుంభకోణం ఉందనే ఆరోపణలు కూడా నిజం కాదని వికాస్‌ఖాన్ తెలిపారు. ఇది సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అంశమని, ఈ కేసులో దర్యాప్తు సంస్థలు తమతో సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు. ఎమైనా అనుమానాలు ఉంటే ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపిస్తామని తెలిపారు.
ETV Bharat / science-and-technology
చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం.. 'స్కిల్' ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదు: డిజైన్‌టెక్ ఎండీ వికాస్‌ఖాన్ విల్కర్ - cbn news
స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం
Published : Sep 12, 2023, 10:24 PM IST
|Updated : Sep 12, 2023, 10:50 PM IST
22:14 September 12
స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం: డిజైన్‌టెక్ ఎండీ
Last Updated : Sep 12, 2023, 10:50 PM IST