తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్​ యూజర్స్​ జరభద్రం.. ఈ యాప్స్ మీ ఫోన్​లో ఉన్నాయా?.. వెంటనే​ అన్​ఇన్​స్టాల్​ చేయండి! - dangerous malware attacks

Dangerous malware SpinOK : ఆండ్రాయిడ్​ యూజర్లకు హెచ్చరిక. గూగుల్​ ప్లేస్టోర్​లో ఉన్న 100కు పైగా యాప్స్​లో ఓ కొత్త మాల్​వేర్​ ఉన్నట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు. 'స్పిన్​ఒకే'గా పిలుస్తున్న ఈ మాల్​వేర్​ ప్రధానంగా ఒక ఎడ్వర్టైజ్​మెంట్ ఎస్​డీకే ద్వారా ఈ యాప్స్​లోకి చేరినట్లు నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పూర్తి కథనం చదవండి.

spinOk malware is detected in android apps
Dangerous malware 'SpinOK is founded on android apps

By

Published : Jun 2, 2023, 5:37 PM IST

Dangerous malware SpinOK : గూగుల్​ ప్లేస్టోర్​లోని దాదాపు 100కి పైగా యాప్స్​లో ఓ సరికొత్త మాల్​వేర్​ ఉన్నట్లు డాక్టర్​ వెబ్​ అనే సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ కొత్త మాల్​వేర్​ను 'స్పిన్​ఓకే'గా పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్​ యూజర్లు తక్షణమే ఈ మాల్​వేర్​ సోకిన యాప్స్​ను తమ ఫోన్ల నుంచి తొలగించాలని వారు హెచ్చరిస్తున్నారు.

SpinOK : ఇది స్పైవేర్ గురూ!​
'స్పిన్​ఓకే' మాల్​వేర్​ సోకిన యాప్స్ అన్నీ కలిపి​ దాదాపుగా 40 కోట్ల వరకు గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్​ అయినట్లు డా.వెబ్ నిపుణులు పేర్కొన్నారు. ఈ మాల్​వేర్​ ఒక ఎడ్వర్టైజ్​మెంట్​(ప్రకటన) ఎస్​డీకే ద్వారా మిగతా యాప్స్​లోకి ప్రవేశించిందని వారు చెబుతున్నారు. ఇక్కడ మరింత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇది ఒక​ స్పైవేర్​గా పనిచేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆశపడితే... దెబ్బైపోతారు!
ఆన్​లైన్​ మోసగాళ్లు ముఖ్యంగా మినీ గేమ్స్​ ద్వారా 'డైలీ రివార్డులు' అనే ఆశ చూపిస్తూ యూజర్లను ఆకట్టుకుంటారు. కొన్ని టాస్క్​లు ఇచ్చి, వాటిని పూర్తి చేసిన వారికి ప్రైజ్​ మనీ ఇస్తామని ఊరిస్తారు. వీటికి ఆశపడి యూజర్లు ఎప్పుడైతే ఈ మాల్​వేర్​ సోకిన యాప్స్​ వాడుతారో... అప్పుడు వారి డివైజ్​ల్లోని ప్రైవేట్​ డేటా మొత్తం చోరికి గురవుతుంది. ముఖ్యంగా రిమోట్​ సర్వర్లలోకి యూజర్ల డేటా మొత్తం వెళ్లిపోతుంది. అందుకే డైలీ రివార్డుల కోసం ఆశపడితే.. మొదటికే మోసం వస్తుందని గుర్తించాలి.

SpinOK effected apps ​:
గూగుల్​ ప్లేస్టోర్​లోని దాదాపు 101కి పైగా యాప్స్​లో స్పిన్​ఓకే ఎస్​డీకే ఉన్నట్లు డాక్టర్​ వెబ్ ప్రకారం పేర్కొంది. వాటిలోని ప్రధానమైన యాప్స్​ లిస్ట్​ మీ కోసం...

⦁ Noizz: ఇది వీడియో ఎడిటర్​ విత్​ మ్యూజిక్​ యాప్​ (10 కోట్ల డౌన్​లోడ్స్​)

⦁ Zapya: ఫైల్​ ట్రాన్స్​ఫర్​, షేర్​ యాప్​ (10 కోట్ల డౌన్​లోడ్స్​)

⦁ VFly: వీడియో ఎడిటర్​, వీడియో మేకర్​ యాప్​ (5 కోట్ల డౌన్​లోడ్స్​)

⦁ MVBit: MV వీడియో స్టేటర్​ మేకర్​ యాప్​ (5 కోట్ల డౌన్​లోడ్స్​)

⦁ Biugo: వీడియో మేకర్​, వీడియో ఎడిటర్​ యాప్​ (5 కోట్ల డౌన్​లోడ్స్​)

⦁ Fizzo Novel: ఆఫ్​లైన్​లో చదువుకునే యాప్​ ( సుమారు కోటి డౌన్​లోడ్స్​)

⦁ Crazy Drop: ( సుమారు ఒక కోటి డౌన్​లోడ్స్​)

⦁ Cashzine: ఎర్న్​ మనీ రివార్డుల యాప్​ ( సుమారు ఒక కోటి డౌన్​లోడ్స్​)

⦁ CashEM: రివార్డుల యాప్​ (50 లక్షల డౌన్​లోడ్స్​)

⦁ Tick: వాచ్​ టు ఎర్న్​ యాప్​ (50 లక్షల డౌన్​లోడ్స్​)

అప్​డేట్​ చేయండి!
ప్రస్తుతం గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి ఈ స్పిన్​ఓకే సోకిన యాప్స్​ కొన్ని తొలగించినప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో క్లీన్​ వెర్షన్​ వచ్చే వరకు ఇలాంటి యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పైన పేర్కొన్న యాప్స్​ మీ ఫోన్​లో ఉంటే కచ్చితంగా వాటిని అన్​ఇన్​స్టాల్​ చేసుకోండి. లేదంటే సరికొత్త వెర్షన్​కు అప్​డేట్​ అవ్వండని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details