తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టొచ్చా? అలాగే వాడొచ్చా? మీ డౌట్స్​కు సమాధానాలు ఇవిగో!

ప్రస్తుత డిజిటల్​ యుగంలో మనం ఫోన్​కు బాగా అలవాటు పడిపోయాం. రోజంతా ఆఫీసుల్లో.. ఇతర పనుల్లో తీరిక లేకుండా ఉండి.. ఫోన్​ను విపరీతంగా వాడి.. ఎక్కువగా రాత్రిళ్లు పడుకునే ముందు ఛార్జింగ్​ పెట్టి నిద్రకు ఉపక్రమిస్తుంటారు చాలా మంది. అయితే.. రాత్రంతా ఛార్జింగ్​ పెడితే బ్యాటరీ దెబ్బతింటుందని, ఫోన్​ లైఫ్​ స్పాన్​ తగ్గుతుందని కొందరు హెచ్చరిస్తుంటారు. అయితే ఇందులో నిజమెంత? ఛార్జింగ్​ ఏ సమయాల్లో పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?

Charging Your Phone Overnight.. Myths and Misconceptions
Charging Your Phone Overnight.. Myths and Misconceptions

By

Published : Jun 30, 2022, 6:57 PM IST

మొబైల్​.. ప్రస్తుతం ప్రజలకు నిత్యావసర వస్తువులా మారింది. కొద్ది సేపు ఫోన్​ కనిపించకుంటే కంగారు పడిపోతుంటారు. అంతలా జీవన విధానాన్ని మార్చేసింది సెల్​ ఫోన్​. మరి అలాంటి ఫోన్​ వాడకం విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రంతా ఛార్జింగ్​ పెట్టొచ్చా? 100 శాతం వరకు ఛార్జింగ్​లోనే ఉంచొచ్చా? బ్యాటరీ జీరో పర్సంట్​కు వచ్చాకే మళ్లీ ఛార్జ్​ చేయడం మంచిదా? పదే పదే ఛార్జింగ్​ చేస్తే బ్యాటరీ దెబ్బతింటుందా? ఛార్జింగ్​ అవుతుండగా ఫోన్​ వాడొచ్చా? ఇవి అందరి మదిలో మెదిలే ప్రశ్నలే. మరి ఇందులో ఏది నిజం? ఛార్జింగ్​ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? ఆ అపోహలు.. వాస్తవాలు తెలుసుకుందాం.

అపోహ-1: రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టొద్దు.
వాస్తవం:ఫోన్​ను రాత్రంతా ఛార్జింగ్​లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదు. మీ ఫోన్​ ఎప్పటికీ ఓవర్​ ఛార్జ్​ అయ్యే అవకాశం లేదు. బ్యాటరీ, ఛార్జర్​పైనా ప్రభావం చూపదు. మంటలు కూడా చెలరేగవు. ఒకవేళ.. ఉపయోగించే ఛార్జర్​లో, ఇంట్లోని ఎలక్ట్రిక్​ వైరింగ్​ సిస్టమ్​లో లోపాలు ఉంటే మాత్రం ఇబ్బందులు రావచ్చు.

.

ప్రస్తుతం వాడకంలో ఉన్న లిథియం-అయాన్​ బ్యాటరీలు.. ఫోన్​ ఫుల్​ ఛార్జ్​ అయిన తర్వాత విద్యుత్​ను సంగ్రహించకుండా నిరోధించే పరికరాలను ఇన్​బిల్ట్​గా కలిగి ఉంటున్నాయి. అయితే.. అన్నివేళలా ఫోన్​ రాత్రంతా ఛార్జింగ్​ పెట్టి అలాగే ఉంచడం మంచిది కాదు. మీ మోడల్​ అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలదా? అన్నది పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అపోహ-2: ఫోన్​ మొత్తం డెడ్​ (బ్యాటరీ జీరో పర్సెంట్​) అయ్యాకే ఛార్జింగ్​ పెట్టాలి.

.
వాస్తవం: ఇది అపోహ మాత్రమే. మీకు అవసరమైనప్పుడల్లా.. ఛార్జింగ్​ పెట్టుకోవచ్చు. లిథియం- అయాన్​ బ్యాటరీలు పరిమిత ఛార్జింగ్​ సైకిళ్లను కలిగి ఉంటాయి. ఐఫోన్​లో ఈ సంఖ్య 500 వరకు ఉంటుంది. 0 పర్సెంట్​ నుంచి 100 పర్సెంట్​ను ఒక సైకిల్​గా పరిగణిస్తాం. కాబట్టి.. ఫోన్​ మొత్తం డెడ్​ అయ్యాక ఛార్జింగ్​ చేసినట్లయితే.. ఒక సైకిల్​ను త్వరగా ఉపయోగించినట్లవుతుంది. కానీ ఫోన్​ బ్యాటరీ 90 శాతం ఉన్నప్పుడు.. ఛార్జ్​ చేస్తే అప్పుడు ఆ సైకిల్​ పూర్తవదు. అందుకే.. ఎక్కువగా ఫోన్​ ఛార్జింగ్​ను 40-80 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఒక సైకిల్​ను ఎక్కువసార్లు వాడుకోవచ్చని అంటున్నారు. ఇది బ్యాటరీ లైఫ్​, పెర్ఫామెన్స్​​ను పెంచుతుందని అంటున్నారు.
అపోహ-3: ఛార్జింగ్​ అవుతుండగా ఫోన్​ వాడొద్దు.

వాస్తవం:ఈ విషయంలో చాలా మందికి భయాలు ఉన్నప్పటికీ ఇది కూడా నిజం కాదు. మీ ఫోన్​ తయారీదారు ఇచ్చిన బ్రాండెడ్​ ఛార్జర్​, బ్యాటరీ వాడుతున్నంతకాలం.. ఛార్జింగ్​ పెట్టి ఫోన్​ వాడితే నష్టమేమీ లేదు. ఇక్కడ కూడా మీ ఎలక్ట్రిక్​ వైరింగ్​ సిస్టమ్​లో సమస్య లేదని నిర్ధరించుకోవాలి.

.

ఛార్జింగ్​ చేస్తూ ఫోన్​ వాడిన సమయాల్లో.. పేలుడు సంభవించిన ఘటనలు ఉన్నప్పటికీ అప్పుడు ఇతర కారణాల వల్లేనని చాలా సార్లు అధికారులు తేల్చారు. థర్డ్​ పార్టీ లేదా లోపాలు ఉన్న ఛార్జర్ల వాడకం, ఇతర కారణాలతో అలాంటి సంఘటనలు జరిగాయని స్పష్టం చేశారు.
అయితే.. ఛార్జ్​ పెట్టి ఫోన్​ వాడుతున్నప్పుడు మీరు నీటికి సమీపంలో ఉండకూడదు. ఈ పరిస్థితుల్లో థర్డ్​ పార్టీ ఛార్జర్లకు కూడా దూరంగా ఉండటమే మంచిది.

అపోహ-4: ఆఫ్​-బ్రాండ్​ ఛార్జర్లు బ్యాటరీని దెబ్బతీస్తాయి.
వాస్తవం:ఇందులో నిజం లేదు. ఫోన్​ ఏ బ్రాండ్​ అయితే.. అదే బ్రాండ్​ ఛార్జర్​ వాడటం పైవాటిల్లో తప్పనిసరి అయినా ఇక్కడ బ్యాటరీని దెబ్బతీస్తాయని చెప్పలేం.
అలా అని.. మీరు వాడే ఫోన్​ బ్రాండెడ్​ ఛార్జర్​ను వాడొద్దని చెప్పలేం. కానీ.. తప్పని పరిస్థితుల్లో ఇతర బ్రాండ్​ ఛార్జర్లు బాగుంటాయనుకుంటే తీసుకోవడానికి సంకోచించకండి. అలాంటివి తీసుకునే ముందు కాస్త శోధించండి.

అపోహ-5: ఫోన్​ను ఎల్లప్పుడూ ఆన్​లోనే ఉంచితే మంచిది.
వాస్తవం:ఇది మంచిది కాదు. చాలా మంది ఫోన్​ను ఎప్పుడూ ఆన్​లోనే ఉంచుతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ఆఫ్​ చేస్తుంటారు. ఇది పెద్ద సమస్య కానప్పటికీ.. ఇది క్రమక్రమంగా బ్యాటరీ లైఫ్​, పెర్ఫామెన్స్​ను తగ్గిస్తుంది. మీరు రోజూ ఫోన్​ను ఆఫ్​ చేయాలని లేదు కానీ.. వారానికి ఓసారి చేస్తే మంచిది. ఇలా రీబూటింగ్​ చేస్తే.. మీ ఫోన్​ సక్రమంగా పనిచేస్తుంది.

అపోహ-6: ఛార్జర్​ అలానే ప్లగ్​ చేసి ఉంచొద్దు.
వాస్తవం:ఛార్జర్​ను అలాగే ప్లగ్​​ చేసి ఉంచొచ్చా వద్దా అనేది మీ వ్యక్తిగతం. కానీ.. ఫోన్​ను ఛార్జ్​ చేసిన తర్వాత.. మంటలు లాంటివి చెలరేగకుండా ఉండేందుకు వెంటనే తీసేయాలని భద్రతా నియమాలు చెబుతున్నాయి.
అయితే.. మీ ఛార్జర్​లో త్వరగా వేడెక్కడం లేదా శబ్దాలు చేయడం వంటి సమస్యలు ఉంటే తీసేయడమే మంచిది. ఇంట్లో వాటర్​ లీకేజీ సమస్యలు ఉన్నా, పెంపుడు జంతువులు ఇంట్లో తిరుగుతున్నా, ఇతర వైరింగ్​ సమస్యలు ఉన్నా.. ఛార్జర్ ప్లగ్​కు​ కనెక్ట్​ చేయకపోవడమే మంచిది.

.

అపోహ-7: ఛార్జర్​ను ఎంతకాలమైనా వాడొచ్చు.
వాస్తవం:అవును. మీరు మీ ఫోన్​ ఛార్జర్​ లేదా మంచి బ్రాండెకు చెందిన ఇతర ఛార్జర్లను వాడుతున్నంతకాలం ఇది సమస్యే కాదు. అయితే.. మీ మోడల్​ బ్రాండ్​ ఛార్జర్​ వాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది సురక్షితం అని గుర్తుంచుకోవాలి. ఇవి చాలావరకు పేలవు. పాడుకావు. ఎలాంటి ఇబ్బందికర శబ్దాలు చేయవు.

మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే.. టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫోన్​ ఛార్జింగ్​ గురించి అపోహలపై ఆందోళన చెందాల్సిన పని లేదు. యూజర్ల నిర్లక్ష్యం, పొరపాట్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వంటివి.. ఫోన్​ డ్యామేజీకి కారణం అవుతాయి కానీ.. ఛార్జర్​తో కాదు.

ఇవీ చూడండి:'సూపర్ స్మార్ట్' ఫోన్​ కావాలా? ఈ 9 యాప్స్​ ఇన్​స్టాల్​ చేసుకోండి!

ఇంటర్నెట్​ లేకుండా బతకడం ఎలా? ఇవిగో 10 మార్గాలు..

జూన్‌లో రాలేదు కానీ.. జులైలో ఈ స్మార్ట్​ ఫోన్స్​ రిలీజ్​ పక్కా!

ABOUT THE AUTHOR

...view details