గూగుల్ యాప్‌లోని ఓ బగ్.. వాయిస్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడంలో ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ మధ్య ఇబ్బంది పెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ అయిన గూగుల్ సెర్చ్ యాప్‌లో కొద్ది రోజుల క్రితమే ఈ బగ్‌ను గుర్తించింది సదరు సంస్థ. అనంతరం గూగుల్ ప్లే స్టోర్‌లో అప్డేట్ రూపంలో దానికి పరిష్కారం చూపింది.
ఇలా చేయండి..
మీరూ కాల్స్ సమస్య ఎదుర్కొని ఉంటే.. ప్లే స్టోర్‌లోకి వెళ్లి, గూగుల్ సెర్చ్ యాప్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. కొందరి ఫోన్లలో యాప్స్ ఆటోమెటిక్‌గా అప్డేట్ అవుతుంటాయి. అలాంటి వారు చింతించాల్సిన పనిలేదు. వారి ఫోన్లో ఈ అప్డేట్ పనిచేస్తూ ఉంటుంది.
గూగుల్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసి కొత్త అప్డేట్ను రీ డౌన్లోడ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోందని కొందరు యూజర్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఆ ఆండ్రాయిడ్ వెర్షన్లో ఇకపై గూగుల్ సేవలు బంద్!