తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం.. పదాహారేళ్లుగా బయోగ్యాస్​.!

అసలే ప్రస్తుతం గ్యాస్​ ధరలు మండిపోతున్నాయి. ఈ సమయంలో అందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. గ్యాస్‌ సిలిండర్‌ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం. కానీ అలాంటి ఆలోచనతోనే మహారాష్ట్రలోని పుణెకు విమల్‌డిగే మాత్రం సిలిండర్‌తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు.

bio gas using from sixteen years  without using  gas cylinder in pune in maharashtra
బయోగ్యాస్​ ప్లాంట్​తో పుణెకు చెందిన విమల్ డిగే​

By

Published : Feb 25, 2021, 5:27 PM IST

మహారాష్టలోని పుణెకు చెందిన విమల్ డిగే‌ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్పడే పనులను చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. కూరగాయలు, పండ్లు, బియ్యం కడిగిన నీళ్లను పెరట్లోని మొక్కలకు పోసేవారు. నెలవారీ సరుకులు కొనాలన్నా కాటన్‌ బ్యాగునే తీసుకెళ్లేవారు. అదే స్ఫూర్తితో ఆమె ఇంట్లోనూ బయోగ్యాస్‌ ప్లాంటును ఏర్పాటుచేయాలని ఆలోచించారు. దీన్ని కొడుకుతో పంచుకుని పుణెలోని రూరల్‌ టెక్నాలజీ సంస్థను సంప్రదించి తమ మేడ మీద బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచీ వంటకు ఈ గ్యాస్‌నే వాడటంతో వారి కుటుంబానికి గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేకుండా పోయింది.

ఎలా పనిచేస్తుందంటే...

ఈ బయోగ్లాస్‌ యూనిట్‌లో రెండు నీటి ట్యాంకులు ఉంటాయి. కింది దాని సామర్థ్యం 1000 లీటర్లు ఉంటుంది. పైట్యాంకు దీనికంటే చిన్నగా ఉంటుంది. దీంట్లో నిల్వ ఉండే బయోగ్యాస్‌ పైప్‌లైన్‌ ద్వారా వంటింట్లోకి సరఫరా అవుతుంది. రెండు ట్యాంకులకూ ఉండే పైపుల్లో వ్యర్థాలను వేయొచ్చు. కూరగాయల ముక్కలు, టీపొడి, మిగిలిన ఆహార పదార్థాలు లాంటి వాటిని ఇందులో వేశారు. ఇవి వేసిన తర్వాత నాలుగు లీటర్ల నీళ్లు పోసి ఆవు పేడతో నింపారు. మూడు వారాల్లోనే గ్యాస్‌ సిద్ధమైంది. ఇది పదహారేళ్లుగా ఎలాంటి రిపేరూ లేకుండా పనిచేస్తోంది. పెద్దలే కాకుండా పిల్లలూ ఆహార వ్యర్థాలను సులువుగా దీంట్లో వేయొచ్చు.

మనుమరాలు శ్రేయకు ఏడేళ్లు ఉన్నప్పుడు ఈ బయోగ్యాస్‌ను ఏర్పాటుచేశారు. ‘నా చిన్నతనంలో నాన్నమ్మ చొరవతోనే ఇంట్లో బయోగ్యాస్‌ ప్లాంటును ఏర్పాటుచేశారు. ఈ వయసులోనూ నాన్నమ్మ ఎంతో చురుగ్గా ఉంటుంది. పాఠ్యపుస్తకాల్లో లేని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మాకు చెబుతుంటుంది. ఎప్పుడైనా పండగలు, ఇతర వేడుకల సమయంలో ఎక్కువ ఆహార పదార్థాలను వండాల్సి వచ్చినప్పుడు.. చాలా అరుదుగా మాత్రమే ఎల్‌పీజీ సిలిండర్‌ను వాడతాం’ అంటోంది శ్రేయ.

ఇదీ చూడండి :కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: కవిత

ABOUT THE AUTHOR

...view details