స్మార్ట్‌వాచ్ అనేది ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. ఇవి స్మార్ట్‌ఫోన్ అనుభూతిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య విషయాలు తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడతాయి. వీటి ద్వారా ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించవచ్చు. అన్ని రకాల ధరల విభాగంలో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అందుబాటు ధరలోని స్మార్ట్‌వాచ్‌లో కూడా మంచి ఫీచర్లు ఉంటున్నాయి. బడ్జెట్ ధరలో ఉన్న మంచి స్మార్ట్‌వాచ్‌ల వివరాలు మీకోసం..
రెడ్ మీ వాచ్
- ప్రధాన ఫీచర్లు-హార్ట్ మానిటరింగ్, గైరో స్కోప్, జియో మాగ్నటిక్ సెన్సార్, 3 యాక్సిస్ యాక్సలరేషన్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్.
- బ్యాటరీ లైఫ్-10 రోజులు
- డయల్ ఆకారం-చతురస్రాకారం
- సరిపోయే ఓఎస్-ఆండ్రాయిడ్, ఐఓఎస్
- స్ట్రాప్ కలర్-నలుపు, నీలి, ఐవరీ, ఆలీవ్
- ధర: రూ. 3,999
నాయిస్ కలర్ ఫిట్ నావ్
- ప్రధాన ఫీచర్లు-యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్, కెపాసిటీవ్, స్టెప్ ట్రాకర్, క్యాలరీ, స్లీప్ మానిటర్.
- బ్యాటరీ-210 ఎంఏహెచ్, 4 రోజులు
- డయల్ ఆకారం-చతురస్రాకారం
- సరిపోయే ఓఎస్-ఆండ్రాయిడ్, ఐఓఎస్
- స్ట్రాప్ కలర్-నలుపు, మిస్ట్ గ్రే, టియల్ గ్రీన్, స్పెషన్ ఎడిషన్
- ధర:రూ. 3499
ఫైర్ బోల్ట్ టాక్
- ఫీచర్లు- ఎస్పీఓ2, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్
- బ్యాటరీ లైఫ్- 4 రోజులు
- డయల్ ఆకారం-వృత్తం
- సరిపోయే ఓఎస్- ఆండ్రాయిడ్, ఐఓఎస్
- స్ట్రాప్ కలర్- బ్లాక్, గ్రే, టియల్
- ధర:రూ. 4,999