ఒకప్పుడు ఫోనంటే మాట్లాడుకోవటానికే. మరిప్పుడో సమస్త ప్రపంచమూ స్మార్ట్‌ఫోన్లలోనే నిక్షిప్తమైపోయింది. ఫొటోలు, వీడియోలు తీయటం దగ్గర్నుంచి సామాజిక మాధ్యమాల విహారం వరకూ అన్నీ ఫోన్లతోనే (uses of smartphone) సాగుతున్నాయి. కొత్త కొత్త యాప్‌ల వెల్లువతో సౌలభ్యమూ పెరిగింది. నిజానికి వీటి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. యాప్‌లతోనే కాదు.. మొబైల్ ఫోన్‌తోనూ కొన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. అంటే చేదోడుగా (benefits of smartphones in healthcare) వాడుకోవచ్చన్నమాట. మన రోజువారీ వ్యవహారాల్లో (benefits of smartphone in our daily life) ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.
ఎత్తు కొలవటం
పిల్లలను గోడకు నిలబెట్టి, తల మీద పెన్సిల్‌ను పెట్టి, గోడకు గీత గీసి, ఎత్తును కొలవటం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అంత తతంగం అవసరం లేదు. ఫోన్‌తోనే కానిచ్చేయొచ్చు. కాకపోతే అధునాతన ఐఫోన్ కావాలి. ఐఫోన్ 12 ప్రొ లేదా ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ మీ చేతిలో ఉంటే మెజర్ యాప్‌ను ఓపెన్ చేసి ఎవరి ఎత్తునైనా ఇట్టే కొలవచ్చు. ముందుగా ఎత్తు కొలవాలని అనుకున్నవారిని ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వారి తల మీద ఒక తెల్లటి గీత, దాని కింద ఎత్తు కనిపిస్తుంది. తెల్ల వృత్తాన్ని నొక్కితే కొలత నమోదవుతుంది. ఫొటోను సేవ్ చేసుకోవాలనుకుంటే కింద కుడివైపు మూలన పాపప్ అయ్యే స్క్రీన్‌షాట్‌ను ట్యాప్ చేసి డన్ బటన్‌ను నొక్కాలి. ఇలా ఫొటోస్‌లో లేదా ఫైల్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. మరి ఆండ్రాయిడ్ ఫోన్ల సంగతేంటని అంటారా? వీటి కోసం థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయిగా. వీటిల్లో మంచి రేటింగ్ ఉన్నది స్మార్ట్ మెజర్. దీన్ని ఓపెన్ చేయగానే ఎదుటి వాళ్ల ఫొటో మీద ప్లస్ గుర్తు కనిపిస్తుంది. దీన్ని పాదాల నుంచి మొదలు పెట్టి తల మీదికి తీసుకొస్తే ఎత్తు తెలుస్తుంది. ఇందులో మన నుంచి వాళ్లు ఎంత దూరంలో ఉన్నారో కూడా కనుక్కోవచ్చు.
మెనూ స్కాన్
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటానికి ఒకప్పుడు థర్డ్ పార్టీ యాప్‌లను వాడేవారు. ఇవి మెమొరీలో ఎక్కువ స్పేస్ తీసుకునేవి. చేసే పని కన్నా ఎక్కువ సమాచారం సేకరించేవి. ఇప్పుడు వీటి అవసరమేమీ లేదు. ఫోన్ కెమెరా చాలు. ఐఫోన్ కెమెరా ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్‌ను ఫోకస్ చేస్తే చాలు. దానంతటదే స్కాన్ చేసి పెడుతుంది. పాపప్ అయ్యే నోటిఫికేషన్‌ను ట్యాప్ చేస్తే ఆయా వెబ్‌సైట్లను చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలోనైతే మోడల్, కంపెనీలను బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరా యాప్ క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్‌తో కూడుకున్నది ఎంచుకుంటే మంచిది. ఉదాహరణకు- సామ్‌సంగ్ గెలాక్సీలో హోంస్క్రీన్ ద్వారా క్విక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘క్యూఆర్ స్కానర్’ను ఎంచుకొని ఓకే బటన్ నొక్కాలి. ఇది కెమెరా యాప్‌ను ఓపెన్ చేస్తుంది. ఇది పనిచేయకపోతే కెమెరా సెట్టింగ్స్‌లో స్కాన్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉందేమో చూడొచ్చు.
గుండె వేగం కొలతకు
గుండె వేగాన్ని తెలుసుకోవటానికి స్మార్ట్‌వాచే అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ అయినా చాలు. ఐఫోన్ యాప్ 'కార్డియో: హార్ట్ రేట్ మానిటర్' కెమెరాతోనే గుండె వేగాన్ని లెక్కిస్తుంది. కెమెరా వెనకాల చూపుడు వేలును ఆనిస్తే చాలు. మారుతున్న రంగులను బట్టి గుండె వేగాన్ని చూపిస్తుంది. ఫోన్ కదలకుండా గట్టిగా పట్టుకోవటం మరవద్దు. ఆండ్రాయిడ్ ఫోన్లలో హార్ట్ రేట్ మానిటర్ యాప్ సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. అయితే ఇవేవీ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కావని తెలుసుకోవాలి. ఒక అంచనాకు మాత్రమే పనికొస్తాయి.