తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Apple iOS 17 Release : స్టన్నింగ్ ఫీచర్లతో.. iOS​ 17 రిలీజ్.. అప్​డేట్​ చేసుకోండిలా! - ios 17 new features list

Apple iOS 17 Release News In Telugu : యాపిల్ యూజర్లకు గుడ్​ న్యూస్​. యాపిల్​ కంపెనీ ఐఓఎస్​ 17 అప్​డేట్​ను రిలీజ్​ చేసింది. దీని ద్వారా ఎన్నో అద్భుతమైన ఫీచర్లను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఈ ఐఓఎస్​ 17 అప్​డేట్​ను దాదాపు అన్నీ ఐఫోన్​ల్లోనూ ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

iOS 17 Feature
iOS 17 Release

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 10:33 AM IST

Apple iOS 17 Release : యాపిల్ లవర్స్​కు గుడ్​ న్యూస్​. యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఐఓఎస్​ 17 అప్​డేట్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఐఫోన్ మోడల్స్ అన్నింటిలోనూ ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. అంటే ఐఫోన్​ XS నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 సిరీస్​ వరకు అన్నింటిలోనూ ఈ ఐఓఎస్​ 17 పనిచేస్తుంది.

అద్భుతమైన ఫీచర్స్
Apple iOS 17 Feature :యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్​ 15 సిరీస్​ను లాంఛ్ చేసింది. ఈ నేపథ్యంలోనే iOS 17 అప్​డేట్​ను కూడా తీసుకొచ్చింది. దీనిలో యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. కాంటాక్ట్​ కార్డ్స్​ : ఇప్పటి వరకు ఐఫోన్ యూజర్లు కేవలం కాలర్ ఐడీ ఫొటోలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సరికొత్త ఐఓఎస్​ 17 అప్​డేట్​తో కాంటాక్ట్​ కార్డ్స్​ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీరు ఫొటోలకు బదులుగా.. యానిమేటెడ్​ మిమోజీలను ఉపయోగించుకోవచ్చు.
  2. రివాంప్డ్​ సెల్​ స్క్రీన్​ : ఐఫోన్​లోని కాలింగ్ ఇంటర్ఫేస్​ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా స్క్రీన్​ దిగువ భాగంలో మ్యూట్​, స్పీకర్ ఫోన్ అప్షన్​లను పొందుపరిచారు. స్క్రీన్ మధ్యలో కాంటాక్ట్ కార్డ్స్​ కనిపించేలా మార్పు చేశారు.
  3. చెక్​ ఇన్​ ఫీచర్​ : ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ చెక్​ ఇన్​ ఫీచర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం iMessage యాప్​లో మీరు ముందుగా మీ గమ్యస్థానాన్ని, సమయాన్ని సెట్ చేసుకోవాలి. దీని వల్ల మీ గమ్యస్థానాన్ని కచ్చితంగా చేరుకునేలా ఇది తోడ్పడుతుంది. ఒకవేళ మీరు అనుకున్న లొకేషన్​ ఎంతకీ రాకపోతే.. దానిని ఆటోమేటిక్​గా చెక్​ చేసి, మీకు సరైన సమాచారం ఇస్తుంది.
  4. స్టాండ్​బై మోడ్​ : మీ ఛార్జింగ్ ఫోన్​ను మల్టీ-ఫంక్షనల్ డిస్​ప్లేగా మార్చవచ్చు. ఎలా అంటే.. స్టాండ్​బై మోడ్​తో.. మీ ఫోన్​ టైమ్​, క్యాలెండర్​ అపాయింట్​మెంట్స్​ను చూసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్లను కూడా డిస్​ప్లే చేసుకోవచ్చు.
  5. నేమ్​డ్రాప్​ : ఐఫోన్ మార్చిన ప్రతిసారీ కాంటాక్ట్స్​ అన్నింటినీ ఎక్స్ఛేంజ్​ చేయాల్సి ఉంటుంది. కానీ నేమ్​డ్రాప్ ఫీచర్​ ద్వారా కేవలం సింగిల్ ట్యాప్​తో మీ కాంటాక్ట్ డీటైల్స్ అన్నీ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు.
  6. ఎన్హాన్స్​డ్​ ఎయిర్​డ్రాప్​ : ఐఫోన్​ ద్వారా ఫోటోలు, ఫైల్స్ షేర్ చేయడం ఇప్పుడు మరింత సులభం అవుతుంది. ఎయిర్​డ్రాప్​ ఫీచర్​తో.. మీ మొబైల్ లేదా వై-ఫై ద్వారా డేటాను సులభంగా షేర్​ చేయవచ్చు. ముఖ్యమైన అంశం ఏమిటంటే.. మీరు మరీ అంత దగ్గరగా లేకపోయినా ఈ ఫైల్ ట్రాన్స్​ఫర్ అనేది సులువుగా జరిగిపోతుంది.
  7. అటోకరెక్ట్ ఇంప్రూవ్​మెంట్ : ఈ ఫీచర్ ద్వారా మీరు చాలా సులభంగా, వేగంగా సందేశాలను టైప్​ చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ ఆటోకరెక్ట్ ఫీచర్​ ద్వారా ఎలాంటి తప్పులు లేకుండా పదాలు రాయడానికి వీలవుతుంది. క్యాప్స్​ లాక్ ఎప్పుడు యాక్టివేట్ చేయాలో కూడా ఇది సూచిస్తుంది.
  8. షేర్​ ప్లే:నిరంతరంగా సంగీతం ఆస్వాదించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు మీ డ్రైవర్ ఫోన్​ను డిస్​కనెక్ట్​ చేయకుండానే.. కార్​ప్లే ద్వారా మ్యూజిక్ ప్లే చేసుకొని.. ఆస్వాదించవచ్చు.
  9. అసిస్టివ్​ యాక్సిస్​ : ఇది ఐఫోన్ ఇంటర్ఫేస్​ను మరింతగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఎంతో మేలు చేకూరుతుంది. వారికి అవసరమైన యాప్స్​ను, లార్జ్ ఐకాన్స్​ను ఆటోమేటిక్​గా యాడ్ చేస్తుంది.
  10. పర్సనల్ వాయిస్​ : ఈ ఫీచర్ ద్వారా మీ సొంత స్వరాన్ని రికార్డ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటే.. ముందుగా మీరు ప్రాంప్ట్​ కార్డ్​లను చదవాలి. అప్పుడు మీ వాయిస్​ రికార్డ్ అయి.. అది ఏఐ వాయిస్​లాగా రూపాంతరం చెందుతుంది. ఇది మీరు టైప్​ చేసిన సందేశాలను కూడా చాలా స్పష్టంగా చదవగలుగుతుంది.
  11. సిరి వాయిస్ అసిస్టెంట్​: యాపిల్ ఇప్పుడు Hey Siri వాయిస్ కమాండ్​ని.. Siri గా మార్చింది. ఇది ఐపాడ్​, మ్యాక్​, హోమ్​పాడ్​, సరికొత్త ఎయిర్​పాడ్​ల్లోనూ పనిచేస్తుంది. ఇకపై యూజర్లు 'హేయ్ సిరి' అని కాకుండా 'సిరి' అని సంబోధిస్తే సరిపోతుంది. మరోముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒకేసారి చాలా కమాండ్స్​ ఇచ్చినప్పుడు.. ప్రతిసారీ 'సిరి' అని సంబోధించాల్సిన అవసరం లేదు.

ఇంకా చాలా ఫీచర్లు రానున్నాయి!
Apple iOS 17 Upcoming Feature : పైన చెప్పినవి మాత్రమే కాదు.. త్వరలో మరిన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. త్వరలో జర్నల్ యాప్​ను తీసుకురానున్నారు. దీని ద్వారా మీ ఫొటోలను, ఇతర యాప్​లను సింక్​ చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​ మ్యాప్స్​ను చూసుకోవచ్చు. ఫుడ్​ ఫొటోలను అనలైజ్ చేసి సరికొత్త వంటకాలను చూడవచ్చు. అలాగే లాక్​డౌన్​ మోడ్​తో మీ ఫోన్​ను సురక్షితం చేసుకోవచ్చు.

అప్​గ్రేడ్ చేసుకోండిలా?
How To Update iOS 17 :

  • ముందుగా మీరు ఐఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • General ఆప్షన్​ను సెలెక్ట్ చేయాలి.
  • Software Updateపై ట్యాప్ చేయాలి.
  • వెంటనే iOS 17 అప్​గ్రేడ్​ అవుతుంది.

నోట్​: ఐఓఎస్​ 17 ను ఒక క్రమపద్ధతిలో రోల్​అవుట్ చేస్తున్నారు. కనుక ఇది ప్రస్తుతం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మిగతా వారికి కూడా అందుబాటులోకి వస్తుంది. కనుక ఈ ఐఓఎస్​ 17 అప్​డేట్​ కనిపించనివారు కాస్త వేచి చూడాలి.

Apple iOS 17 Supported Devices List :ఐఓఎస్​ 17 అనేది వైడ్ రేంజ్​ ఐఫోన్ మోడల్స్​ అన్నింటికీ కంపాటిబులిటీ కలిగి ఉంది. ముఖ్యంగా ఐఫోన్​ ఎస్​ఈ (సెకెండ్ జనరేషన్ నుంచి లేటెస్ట్ మొబైల్ వరకు).. అలాగే లేటెస్ట్ఐఫోన్ 14 సిరీస్​కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఐపాడ్​లకు కూడా ఈ ఐఓఎస్​ 17 సపోర్ట్ చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details