సరికొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను పలకరించేందుకు వాట్సాప్ సన్నద్ధమవుతోంది(whatsapp new features). కొత్త ఫీచర్ల కోసం యూజర్లు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..
కమ్యూనిటీ
ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఒక చోట చేరి తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్‌ని(whatsapp community features) తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ గ్రూప్ స్థానంలో దీన్ని పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతోపాటు ఎక్కువమందితో సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.
వాట్సాప్ ప్లేయర్
వాట్సాప్‌లో మనం పంపే వాయిస్ మెసేజ్‌లు విభిన్న వేగంతో వినేందుకు వీలుగా ప్లేయర్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయనుంది. దీని సాయంతో యూజర్స్ తమకు వచ్చిన పెద్ద ఆడియో మెసేజ్‌లను వింటూనే ఇతరులతో ఛాట్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్ ముందుగా తనకు వచ్చిన ఆడియో మెసేజ్‌ని వాట్సాప్‌లో పిన్ చేసుకోవాలి. తర్వాత ఆడియోని ప్లే చేసి వింటూనే చాట్ కంటిన్యూ చేయొచ్చు.
రెండు మొబైల్స్‌లో ఒకే వాట్సాప్
ఒకే మొబైల్‌లో రెండు వాట్సాప్ యాప్‌లను ఉపయోగించుకోవడం గురించి తెలిసే ఉంటుంది. అలానే ఒకే వాట్సాప్ ఖాతాను రెండు వేర్వేరు మొబైల్స్‌లో ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌లో భాగంగా తీసుకురానున్నట్లు సమాచారం. మల్టీ డివైజ్ ఫీచర్‌లో అయితే ట్యాబ్, డెస్క్‌టాప్, పీసీతోపాటు ఒక మొబైల్‌లో ఉపయోగించుకోవచ్చు. తాజాగా అందుబాటులోకి రానున్న ఫీచర్‌తో ఒకేసారి రెండు మొబైల్స్‌లో ఉపయోగించవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
'అబౌట్' నచ్చిన వారికి మాత్రమే
వాట్సాప్ రానున్న రోజుల్లో అబౌట్ సెక్షన్‌లో కీలక మార్పులు చేయనుంది. దీనివల్ల యూజర్ అనుమతించిన వారు మాత్రమే వారి ప్రొఫైల్ ఫొటో చూడగలరు. స్టేటస్ ఫీచర్ తరహాలోనే ఇందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, నోబడి వంటి ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరూ మీ ప్రొఫైల్ చూస్తారు. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసిన వారు తప్ప కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు మాత్రమే చూస్తారు. నోబడి అయితే ఎవ్వరూ మీ ప్రొఫైల్ ఫొటోను చూడలేరు. ప్రస్తుతం పరీక్షల దశలోఉన్న ఈ పీచర్‌ని త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది.