ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసే చోట మొబైల్‌ఫోన్ వినియోగిచడం అనేది సర్వసాధారణం. దీనివల్ల ఉత్పాదకత దెబ్బతింటుందనేది చాలా మంది వాదన. అయితే చట్టసభల్లో లేదా ప్రభుత్వ సమావేశాల్లో ముఖ్యమైన అంశాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు వాటిపై దృష్టి సారించకుండా మొబైల్‌ఫోన్‌ను చూస్తూ ఉంటున్నారు.
చట్టసభల్లో..
దీంతో చట్టసభల్లో ఏ నాయకుడు ఎంతసేపు మొబైల్ ఉపయోగిస్తున్నారనేది తెలుసుకునేందుకు బెల్జియంకు చెందిన డ్రైస్ డిపూర్టర్ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒక ప్రోగ్రాం రాశారు. ఇది ఫేస్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేస్తుంది. వాళ్లు సభలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతసేపు మొబైల్ ఉపయోగిస్తున్నారనేది దీని సాయంతో తెలుస్తుంది. ఆ సమయంలో వారు ఎందుకోసం అంటే తాము మాట్లాడాల్సిన అంశానికి సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నారా, మెయిల్స్ చెక్ చేస్తున్నారా, సామాజిక మాధ్యమాలను చూస్తున్నారా లేదా ఇతరత్రా కార్యక్రమాలకు మొబైల్ ఉపయోగిస్తున్నారా అనేది మాత్రం తెలియదు.
అక్కడ ప్రయోగాత్మకంగా..