కరోనా మహమ్మారిపై పాశుపతాస్త్రం లాంటి టీకాలను అభివృద్ధి చేయడంలో విశేష పాత్ర పోషించిన ఏడుగురు పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. స్పెయిన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టురియాస్ ఫౌండేషన్ పురస్కారం వారిని వరించింది. ఈ అవార్డు ద్వారా 60వేల డాలర్ల (సుమారు రూ. 44.5 లక్షలు) నగదు ప్రోత్సాహం లభించనుంది.
ETV Bharat / science-and-technology
కరోనా టీకా సృష్టికర్తలకు అరుదైన గౌరవం - రష్యా కరోనావైరస్ టీకా
కరోనా టీకాలను అభివృద్ధి చేయడంలో విశేష పాత్ర పోషించిన ఏడుగురు పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. స్పెయిన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టురియాస్ ఫౌండేషన్ పురస్కారం వారిని వరించింది.
శాస్త్ర పరిశోధన విభాగంలో కటాలిన్ కరికొ(హంగేరీ), డ్రూ వెయిస్‌మన్, ఫిలిప్ ఫెల్గనర్( అమెరికా), ఉగుర్ సహిన్, ఒజ్లెమ్ టు రెసి(జర్మనీ), డెరిక్ రోస్సి(కెనడా), సారా గిల్బర్ట్(బ్రిటన్) నిలిచినట్లు జ్యూరీ బుధవారం ప్రకటించింది. సైన్స్ చరిత్రలోనే అద్భుత విజయాల్లో ఒకటిగా నిలిచిన ఘట్టానికి వీరు సారథ్యం వహించారని పేర్కొంది. అతి తక్కువ సమయంలోనే కరోనాపై పోరాటానికి అవసరమైన సమర్థ వ్యాక్సిన్లను సృష్టించడంలో వీరు ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడింది. ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి పరిశోధన రంగం ఎంత కీలకమో చెప్పడానికి వీరు చేసిన కృషి నిదర్శనంగా నిలించిందని పేర్కొంది.