Useful Android Apps: కెమెరా, గ్యాలరీ, ఫైల్ మేనేజర్, కాంటాక్ట్స్, మ్యూజిక్ ప్లేయర్.. దాదాపు నిత్యం ఉపయోగించే యాప్స్ ఇవి. అయితే.. స్మార్ట్ ఫోన్లోనే డిఫాల్ట్‌గా వచ్చే ఈ యాప్స్‌లో ఎప్పటికీ పెద్దగా మార్పులు ఉండవు. ఉన్న ఫీచర్లతోనే సరిపెట్టుకోవాలి. అయితే.. ఇలాంటి ఉపయోగకర యాప్స్‌కు ఇప్పుడు అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ మరింత స్మార్ట్‌గా తయారవుతుంది. వాటిపై ఓ లుక్కేయండి!
1. ఫైల్స్ గో(ఫైల్ మేనేజర్):ఫైల్ మేనేజ్మెంట్ యాప్‌కు.. 'ఫైల్స్ గో' మంచి ఆల్టర్నేటివ్. మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన డూప్లికేట్ ఫైల్స్, జంక్ పిక్చర్స్, వీడియోలు గుర్తించి తొలగించమని సలహా ఇస్తుంది. వినియోగంలో లేని యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేయమని గుర్తు చేస్తుంది. వీటన్నింటితో పాటు భారీ మొత్తంలో ఉన్న ఫైల్స్‌ను షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
2. పికాయ్(కెమెరా):పికాయ్.. మొబైల్లోని డిఫాల్ట్ కెమెరా యాప్‌కు మంచి ప్రత్యామ్నాయం. సీన్ డిటెక్షన్ అల్గారిథం దీని ప్రత్యేకత. మీరు ఫొటో తీస్తుండగానే.. అది మరింత అందంగా కనిపించేందుకు ఎలాంటి ఫిల్టర్ ఉపయోగిస్తుంటే బాగుంటుందో లైవ్‌లోనే సూచిస్తుంది. సంజ్ఞలతోనే ఆ ఫిల్టర్లను మార్చుకోవచ్చు. ఇది ఫ్రంట్ కెమెరాకు కూడా పనిచేస్తుంది.
3. స్మార్ట్ లాంచర్ 5:ఫోన్లో పాత ఇంటర్‌ఫేస్‌తోపాటు, యాప్స్, ఫోన్ పనితీరులో మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు లాంచర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి స్మార్ట్ లాంచర్ 5. ఈ యాప్‌ను లాంచ్ చేయడం ద్వారా ఫొన్లోని యాప్స్‌ను గ్రిడ్స్ స్థానంలో విడ్జెట్స్గా మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా యాప్‌లను రీసైజ్ చేసుకోవచ్చు. ప్రీమియం వెర్షన్‌తో వాల్‌పేపర్, ఎడిట్ కేటగిరీలు, అడ్వాన్స్డ్ ఐకాన్స్ సదుపాయాలు అన్‌లాక్ చేయవచ్చు.
4. ట్రూకాలర్: ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజింగ్ యాప్ డిఫాల్ట్‌గా వచ్చినా అంతగా రక్షణ కలిగి ఉండదు. ఇలాంటి వారికోసం మెసేజ్ యాప్‌ను మార్చుకోవడాన్ని గూగుల్ సులభతరం చేస్తుంది. ట్రూకాలర్‌లో కాలర్ ఐడీ ఆన్ చేసిన తర్వాత స్పామ్ మెసేజ్స్ రాకుండా చూస్తుంది. ఇవే కాక వన్‌టైమ్ పాస్వర్డ్ కాపీ చేయడం, స్మార్ట్ కేటగిరీ ఆప్షన్లతో ఉంటుంది.
5. మ్యూజిక్స్‌మ్యాచ్(మ్యూజిక్ ప్లేయర్):మ్యూజిక్స్‌మ్యాచ్ అనేది గుర్తింపు పొందిన యాప్ కానప్పటికీ.. మంచి ఫీచర్లను కలిగి ఉండి అద్భుతంగా పనిచేస్తుంది. మనం ప్లే చేస్తున్న పాటలకు సంబంధించిన లిరిక్స్‌ను చూపిస్తుంది. ఆ లిరిక్స్‌ను పోస్టర్‌గా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇతర భాషల్లోని పాటలను మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసే సదుపాయం కూడా ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లైన యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై లాంటి యాప్స్‌లోనూ పనిచేస్తుంది.