తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Gaganyaan: మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర అప్పుడే.. - మానవ సహిత అంతరిక్ష యాత్ర

గగన్​యాన్​లో భాగంగా మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్రను చేపట్టే విషయంపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా ఇప్పటికే ఆలస్యమైన యాత్రను ఈ ఏడాది డిసెంబర్​లో చేపట్టనున్నట్లు పేర్కొంది.

ISRO first uncrewed mission
మొదటి మానవరహిత మిషన్​

By

Published : Jun 28, 2021, 4:42 PM IST

Updated : Jun 28, 2021, 5:04 PM IST

డిసెంబర్​లో మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్రగగన్​యాన్​ను చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. మానవ రహిత మిషన్​ను భూ కక్ష్యలోకి పంపనున్నట్లు చెప్పింది. కరోనా వల్ల ఇప్పటికే గగన్​యాన్​ ప్రయోగం ఆలస్యమైనట్లు ఇస్రో తెలిపింది. లాక్​డౌన్​లతో హార్డ్​వేర్​ పంపిణీ మందగించినట్లు పేర్కొంది. దీంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదని వివరించింది.

గగన్​యాన్​ను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి మానవ రహిత మాడ్యూల్​ను డిసెంబర్​ 2021లో, రెండోది 2022-23లో అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో వివరించింది.

గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. ఎక్కువ గంటలు పనిచేసైనా ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్‌!

Last Updated : Jun 28, 2021, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details