తెలంగాణ

telangana

ETV Bharat / priya

'నువ్వుల పొడి కూర' సూపర్ రెసిపీ! - etv bharat food

రోజూ కూరగాయలు తింటేనే ఆరోగ్యం. అలా అని రోజూ ఒకే స్టైల్​లో తినాలంటే బోరు. అందుకే, సాధారణ కూరకు నువ్వుల పొడి కలిపి కమ్మదనాన్ని పెంచేసే రెసిపీ మీ కోసం.. చూసేయండి..

try-sesame-seed-powder-or-nuvvula-podi-koora-at-home
'నువ్వుల పొడి కూర' సూపర్ రెసిపీ!

By

Published : Oct 4, 2020, 1:00 PM IST

నువ్వుల పొడిలోని ఐరన్.. కూరలకు పట్టించి తింటే రుచితో పాటు, ఆరోగ్యమూ రెట్టింపు అవుతుంది..

కావాల్సినవి..

దోసకాయ - మధ్య సైజు ఒకటి, ఉల్లిపాయలు - రెండు,కొత్తిమీర - కట్ట, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - మూడు చెంచాలు, తాలింపు గింజలు - చెంచా, పసుపు -కొద్దిగా, నువ్వులపొడి -రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం - కొద్దిగా.

తయారీ

దోసకాయలు, ఉల్లిపాయల్ని ముక్కల్లా తరగాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేడిచేసి తాలింపు గింజలు వేయించాలి. అవి వేగాక కరివేపాకు కూడా వేసేయాలి. అవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేయించి.. దోసకాయ ముక్కలు చేర్చాలి. అందులోనే పసుపు వేసి మూతపెట్టేసి బాగా మగ్గనివ్వాలి. అవసరాన్ని బట్టి కాసిని నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు ఆవిరై దింపేముందు నువ్వులపొడి, కారం కూడా వేసి దింపేయాలి.

ఇదీ చదవండి: 'వెజ్‌ సీక్‌ కబాబ్‌' శాకాహారుల స్పెషల్ రెసిపీ!

ABOUT THE AUTHOR

...view details