తెలంగాణ

telangana

ETV Bharat / priya

చిరుజల్లుల వేళ.. 'చికెన్‌ రైస్‌' తినకపోతే ఎలా..? - easy chicken rice

అసలే వానాకాలం.. అందులోనూ కరోనా తరుణం. వేడివేడిగా.. ఆరోగ్యగంగా ఏదోటి తినాల్సిన సమయం. మరింకెందుకు ఆలస్యం.. నోరూరించే 'చికెన్ రైస్' రెసిపీ చూసి, చేసుకుందాం రండి.

try chicken rice recipe at home
చిరుజల్లుల వేళ 'చికెన్‌ రైస్‌' తినకపోతే ఎలా..?

By

Published : Sep 2, 2020, 10:30 AM IST

చికెన్ అంటే ఇష్టపడని మాంసాహారులుంటారా? కానీ, చికెన్ తో ఎప్పుడూ కూరలు, ఫ్రైలే కాదు అప్పుడప్పుడూ ఇలా చికెన్ రైస్ చేసుకుంటే ఇంటిల్లిపాది లాగించేస్తారంతే..

కావల్సినవి..

అన్నం - ఒకటిన్నర కప్పు, ఉడికించిన చికెన్‌ - ముప్పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి - రెండు రెబ్బలు (దంచుకోవాలి), పొడుగ్గా తరిగిన క్యారెట్‌ - అరకప్పు, ఉడికించిన పచ్చిబఠాణీ - పావుకప్పు (అవి లేకపోతే ఎండుబఠాణీని నానబెట్టి ఉడికించుకోవాలి), వెన్న - టేబుల్‌స్పూను, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - చెంచా.

తయారీ ఇలా..

బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలూ, దంచిన వెల్లుల్లి వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయనుకున్నాక క్యారెట్‌ తరుగు, ఉడికించిన పచ్చిబఠాణీ వేసి వేయించాలి. క్యారెట్‌ పచ్చివాసన పోయాక చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఇది కూరలా తయారయ్యాక అన్నం, వెన్న, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.

ఇదీ చదవండి:'చాక్లెట్‌ ఆల్మండ్‌ పుడ్డింగ్‌' ఇంట్లోనే చేసుకుందామిలా...!

ABOUT THE AUTHOR

...view details